BigTV English

ENGLAND: క్రికెట్ పుట్టింది అక్కడే.. కానీ వరల్డ్ కప్ గెలవడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలుసా?

ENGLAND: క్రికెట్ పుట్టింది అక్కడే.. కానీ వరల్డ్ కప్ గెలవడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలుసా?

ENGLAND: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్. కానీ ఆ జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవడానికి 44 ఏళ్లు పట్టింది. అత్యధిక సార్లు ఫైనల్ లో ఓడిన టీమ్ కూడా ఇంగ్లండే. 1975 తొలి వరల్డ్ కప్ లో సెమీస్ లోనే ఓడింది. 1979 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తొలిసారి ఫైనల్ కు చేరుకుంది. కానీ ఫైనల్ లో విండీస్ దాటికి నిలబడలేకపోయింది. 1983లోసెమీస్ లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. 1987 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ రెండోసారి ఫైనల్ కు చేరింది . ఉత్కంఠగా సాగిన తుదిపోరులో ఇంగ్లండ్ ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ కైవసం చేసుకుంది.


1992 మెగా టోర్నిలోనూ ఇంగ్లండ్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈసారి ఆ జట్టుకు పాకిస్థాన్ షాకిచ్చింది. ఇలా తొలి 5 ప్రపంచ్ కప్ ల్లో 3 సార్లు ఇంగ్లండ్ జట్టు తుదిపోరులో చేతులెత్తేసింది. ఆ తర్వాత 6 ప్రపంచ్ కప్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరలేదు. ఏ టోర్నిలో టైటిల్ ఫేవరట్ గా బరిలోకి దిగలేదు. 27 ఏళ్లపాటు మరోసారి కనీసం సెమీస్ కూడా ఆ టీమ్ చేరలేదు.

2019 ప్రపంచ కప్ లో మాత్రం ఇంగ్లండ్ భారీ అంచనాలతో బరిలోకి దిగింది. ఊహించిన విధంగానే రాణించింది. ఫైనల్ కు చేరుకుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ అద్భుతంగా సాగింది. ఇప్పటికి వరకు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇదే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్. ఈ మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్ కి వెళ్లింది. సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ ను విజేతగా ప్రకటించారు. ఇలా ఇంగ్లండ్ ప్రపంచ కప్ కల నెరవేరింది.


అత్యధికంగా ఆస్ట్రేలియా జట్టు 7సార్లు ఫైనల్ చేరితే ఆ తర్వాత స్థానం ఇంగ్లండ్ దే. ఈ జట్టు 4 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది. ఇక వెస్టిండీస్, భారత్, శ్రీలంక జట్లు మూడేసిసార్లు, పాకిస్థాన్ , న్యూజిలాండ్ జట్లు రెండేసి సార్లు ఫైనల్ కు వచ్చాయి. 13వ వరల్డ్ కప్ టోర్నిలో ఇంగ్లండ్ టైటిల్ ఫేవరట్స్ లో ఒకటి అనడంలో సందేహం లేదు. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. దూకుడు ఆ జట్టు విజయమంత్రం. మరి స్పిన్ కు అనుకూలించే భారత్ పిచ్ లపై ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి మరి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×