E-Paper
Advertisement

Olympic Boxer : ఒలింపియన్ బాక్సర్‌కు గాయం.. సర్జరీకి ప్రభుత్వం సాయం..

Olympic Boxer : ఒలింపియన్ బాక్సర్‌కు గాయం.. సర్జరీకి ప్రభుత్వం సాయం..
Advertisement
Olympic Boxer

Olympic Boxer : ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్‌నే తమ కెరీర్‌గా మార్చుకోవాలి అనుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ఇంట్లో ప్రోత్సాహం లేకపోవడం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల వారు అనుకున్నది చేయలేక ఆగిపోతున్న వారే ఎక్కువమంది ఉన్నారు. అలాంటి వారికి సాయం చేయడం కోసమే దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొస్తున్నాయి. తాజాగా ఒక ఒలింపియన్ బాక్సర్‌కు గాయమయితే తనకు సాయం చేయడానికి కూడా పలు సంస్థలు ముందుకొచ్చాయి.

Advertisement

స్పోర్ట్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉండే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ)లో ఉండే విభాగం సెంట్రల్ అథ్లెట్ ఇంజురీ మ్యానేజ్‌మెంట్ సిస్టమ్ (సీఏఐఎమ్ఎస్) ఒలింపియన్ బాక్సర్ అయిన వికాస్ కృష్ణకు సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఒక అసెస్మెంట్ క్యాంప్ సమయంలో వికాస్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. దానికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ ఆటగాడికి ఆర్థికంగా సాయం చేయడం కోసం ఈ సంస్థలు ముందుకొచ్చాయి.

ప్రస్తుతం వికాస్ కృష్ణ పటియాలా సెంటర్‌లో జరుగుతున్న బాక్సింగ్ నేషనల్ క్యాంప్‌లో పాల్గొంటున్నాడు. ఇందులో పాల్గొంటున్న సమయంలోనే వికాస్‌ ఎడమ చేతి భూజానికి గాయమయ్యింది. అసలు ఆ గాయం గురించి తెలుసుకోవడం కోసం ఎమ్మారై అవసరమని డాక్టర్లు రెకమెండ్ చేశారు. ఎమ్మారైలో తనకు డిస్టల్ బైసెప్స్ టియర్ అయినట్టుగా వారు గుర్తించారు. ఈ రిపోర్ట్స్‌ను సీఏఐఎమ్ఎస్‌కు ఫార్వాడ్ చేశారు.

Advertisement

డాక్టర్లు వికాస్ కృష్ణ గాయానికి సర్జరీ అవసరమని తెలుసుకున్న సీఏఐఎమ్ఎస్.. ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొచ్చింది. తాజాగా వికాస్ సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా ముగించుకొని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు కూడా. తన సర్జరీకి ఎస్ఏఐతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) కూడా ఆర్థికంగా సాయాన్ని అందించింది. నేషనల్ క్యాంపర్స్ ఇన్సురెన్స్ స్కీమ్ ద్వారా వికాస్ కృష్ణకు సర్జరీ జరిగిందని వారు చెప్తున్నారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×