E-Paper
Advertisement

Rahul Gandhi: రాహుల్‌గాంధీ మాస్ ఎంట్రీ.. ‘శివాజీ’ మూవీ తరహాలో..

Rahul Gandhi: రాహుల్‌గాంధీ మాస్ ఎంట్రీ.. ‘శివాజీ’ మూవీ తరహాలో..
Advertisement
rahul gandhi entry

Rahul Gandhi: ఖమ్మం జనగర్జనతో.. కాంగ్రెస్ కేక పెట్టింది. ప్రత్యర్థి పార్టీల్లో కాక రేపింది. లక్షల్లో జనం తరలివచ్చారు. అంతా స్వచ్చందంగానే. సర్కారు నిర్బంధకాండకు ఎదురొడ్డి.. సభకు చీమలదండులా కదిలొచ్చారు. జనగర్జన సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ముందు ప్రకటించిన సమయానికే రాహుల్ గాంధీ విచ్చేశారు. కాంగ్రెస్ సభలో రాహుల్ ఎంట్రీ అదుర్స్.

సాయంత్రం ఢిల్లీ నుంచి ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంలోని సభాప్రాంగణానికి వచ్చారు. శివాజీ సినిమా క్లైమాక్స్‌లో హీరో రజినీకాంత్ తరహాలో ఉంది రాహుల్ ఎంట్రీ.

Advertisement

రాహుల్ రాక కోసం భారీగా ప్రజలు హెలీప్యాడ్ దగ్గర గుమ్మికూడారు. హెలికాప్టర్ దిగి కారు ఎక్కిన రాహుల్‌ను చూసేందుకు ప్రజలు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని పక్కకు తరిమేశారు.

అనంతరం కారులో.. హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరారు రాహుల్. కార్యకర్తల్లో ఉత్సాహం ఆగలేదు. కారులో కూర్చొన్న తమ నాయకుడిని చూసేందుకు మళ్లీ జనం ముందుకొచ్చారు. ఈసారి లాఠీఛార్జీ చేయాల్సిన అవసరం రాలేదు. రాహుల్‌గాంధీనే కారు సన్‌రూఫ్ ఓపెన్ చేసి.. కారులో నిలుచొని.. చుట్టూ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. హెలీప్యాడ్ నుంచి డయాస్ వరకూ.. రాహుల్ ర్యాలీ కొనసాగింది. రాహుల్ గాంధీకి ప్రజల్లో ఉన్న క్రేజ్‌కు.. ఖమ్మం సభలో ఆయన ఎంట్రీనే నిదర్శనం.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×