BigTV English

Manu Bhaker: ఢిల్లీలో మను బాకర్ కి ఘన స్వాగతం.. మళ్లీ పారిస్ కి ప్రయాణం

Manu Bhaker: ఢిల్లీలో మను బాకర్ కి ఘన స్వాగతం.. మళ్లీ పారిస్ కి ప్రయాణం

Olympic Medalist Manu Bhaker At Delhi Airport(Sports news today): పారిస్ ఒలింపిక్స్ నుంచి ఆటలైపోయిన క్రీడాకారులు ముగింపు ఉత్సవాల వరకు ఉంటారు. అయితే భారత దేశానికి రెండు కాంస్య పతకాలు తీసుకొచ్చిన మను బాకర్ మాత్రం ముందుగా ఢిల్లీ వచ్చింది. తనతో పాటు కోచ్ జస్పాల్ రాణా కూడా ఉన్నారు. అయితే ఢీల్లీ ఎయిర్ పోర్టులో మనుబాకర్ కి ఘన స్వాగతం లభించింది. క్రీడాఉన్నతాధికారులు తరలివచ్చారు. అభిమానులు వేలాదిగా వచ్చి పుష్పగుచ్ఛాలు అందించారు.


మనుబాకర్ ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించారు. అనంతరం కారులో ర్యాలీగా బయలుదేరారు. భరతమాత ముద్దు బిడ్డ సగర్వంగా భారత్ లో అడుగుపెట్టింది. అనే నినాదాలు హోరెత్తిపోయాయి. రహదారి పొడవునా ఫ్ల కార్డులతో ప్రజలు స్వాగతం పలికారు. కోచ్ జస్పాల్ రాణా తండ్రి నారాయణ్ సింగ్ రాణా మాట్లాడుతూ తను నా కొడుకని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని తెలిపాడు.

Also Read: టీమ్ ఇండియా.. గెలుస్తుందా?: నేడు శ్రీలంకతో చావో.. రేవో!


ముందుగా వచ్చిన మనుబాకర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు శనివారం మళ్లీ వెళ్లనుంది. భారత పతకాన్ని పట్టుకునే అరుదైన అవకాశం తనకే దక్కింది. ఈ సమయంలో కేంద్ర క్రీడాశాఖా మంత్రిని కలవనుంది. అయితే మూడో పతకం త్రటిలో తప్పిపోయింది. లేదంటే ముచ్చటగా మూడు పతకాలతో భారత ఒలింపిక్స్  చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించేది. ఇప్పుడు కాంస్యంతో మెరిసిన మను వచ్చే ఒలింపిక్స్ నాటికి స్వర్ణాలతో మురిపిస్తుందని అభిమానులు అంటున్నారు.

Related News

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Dhanashree Verma: చాహల్ టార్చర్… కేకలు పెట్టి ఏడ్చిన ధనశ్రీ!

Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Ms Dhoni: ధోని వాచ్ ల కలెక్షన్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే…ఎన్ని కోట్లు అంటే

Mumbai Indians : ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్.. అర్జున్ టెండూల్కర్ పై ముంబై ఇండియన్స్ వేటు?

Big Stories

×