BigTV English

Harish Rao Tweet: ఆత్మహత్యలు చేసుకోవద్ధని రైతులకు సూచించిన హరీశ్‌రావు

Harish Rao Tweet: ఆత్మహత్యలు చేసుకోవద్ధని రైతులకు సూచించిన హరీశ్‌రావు

BRS MLA Harish Rao suggested that farmers should not commit suicide: ఇటీవలే ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన రైతు ఆత్యహత్య ఘటన మరవకముందే తాజాగా..అదే జిల్లాకు చెందిన రైతు ఆత్మహత్య చేసుకోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు తనదైన శైలిలో స్పందించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా దృష్టకరమని ఆయన అన్నారు. ప్రభుత్వంపై రైతులు కోల్పోతున్న నమ్మకానికి ఇదొక నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా గతంలో ఈ ఘటన మరవకముందే ఇలాంటి ఘటన జరగడం చాలా శోఛనీయమని ఆయన అన్నారు. తెలంగాణలోని రైతులు ఎవరుకూడా అధైర్యపడవద్ధని ఆయన సూచించారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే తమతో పాటుగా మేము సైతం వారికి అండగా నిలుస్తామని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.


ఇంతకీ అసలు మ్యాటర్ ఏం జరిగిందంటే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి తన భూమిని దున్నుతున్నాడని మనస్థాపానికి గురి అయ్యాడు. అంతేకాకుండా తన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి దుక్కి దున్నుతున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లా జానపహాడ్‌ తండాకు చెందిన ఏలేటి వెంకట్‌రెడ్డి ఆగష్టు నాలుగున క్రిమిసంహాకర మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రోజు ఉదయం ఆస్పత్రిలో రైతు మరణించాడు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో అతడు తీసుకున్న సెల్పీ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో ఆ వీడియోపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తనదైన శైలిలో స్పందించాడు. అంతేకాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు ఆత్మహత్యపై స్పందించకపోవడం చాలా దారుణమని దుయ్యబట్టారు. అంతేకాదు సోషల్‌మీడియా ట్విట్టర్ వేదికగా రీట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Also Read: నటుడు, కమెడియన్ బిత్తిరి సత్తిపై కేసు నమోదు


కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను గాలికొదిలేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ వైఖరిపైనా సైతం ఫైర్ అయ్యారు. అందులోనూ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టాలని కోరారు. అంతేకాదు ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు తన సంఘీభావం తెలిపారు. ఇక ముందు ఏ రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడవద్దని అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అందులోనూ తెలంగాణ రైతాంగానికి తమ బీఆర్‌ఎస్ పార్టీ అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఇక రైతాంగానికి రుణమాఫీ అనుకున్న స్థాయిలో ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. తక్షణమే అందరి రైతులకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం మరణించిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related News

PC Ghosh Commission: అందుకే ఇదంతా.. మేడిగడ్డ కుంగుబాటు అసలు కారణం ఇదే: KCR

Rain Alert: బిగ్ అలర్ట్! మరో 3 రోజులు కుండపోత వర్షాలు.. ఎవరు బయటకు రావొద్దు..

Marwadi Controversy: మర్వాడీస్ రచ్చ.. అసలు కారణాలు ఇవే! ఎక్కడిదాకా వెళ్తోంది?

Lady Aghori: లేడీ అఘోరీ కాశీకి.. వర్షిణి ఇక అంతేనా? బయటికి వచ్చిన శ్రీనివాస్ కొత్త ప్లాన్స్ ఏమిటి?

Hyderabad crime: మహిళతో కుదరని యవ్వారం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. కేపీహెచ్‌బీలో గ్యాంగ్ కలకలం!

Rajanna Sirisilla news: అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సుగంధ పట్టుచీర.. వేములవాడ అమ్మవారికి అరుదైన కానుక!

Big Stories

×