E-Paper
Advertisement

స్పాన్స‌ర్లు దిక్కులేక‌..20 ఏళ్లుగా PEPSIతోనే క‌థ గ‌డిపేస్తోన్న పాకిస్తాన్‌

స్పాన్స‌ర్లు దిక్కులేక‌..20 ఏళ్లుగా PEPSIతోనే క‌థ గ‌డిపేస్తోన్న పాకిస్తాన్‌
Advertisement

Pakistan Team – Pepsi :  పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ జట్టులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు నెలకొన్నాయి. ఒకసారి అద్భుతంగా ఆడటం..మ‌రోసారి చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అలవాటైపోయింది. ఇక ఈ జట్టులో నిత్యం ఏదో ఒక వివాదాస్పద మార్పు జరుగుతూనే ఉంటుంది. అలాంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జెర్సీపై తాజాగా చర్చ మొదలైంది. పాకిస్తాన్ క్రికెటర్లు గత రెండు దశాబ్దాలుగా పెప్సీ కంపెనీ లోగోను మాత్రమే తమ జెర్సీ పైన వేసుకుంటున్నారు.

స్పాన్స‌ర్లు దిక్కులేక‌..20 ఏళ్లుగా PEPSIతోనే క‌థ గ‌డిపేస్తోన్న పాకిస్తాన్‌

పాకిస్తాన్ జెర్సీ పైన కేవలం పెప్సీ ( PEPSI) లోగో మాత్రమే ఎందుకు ఉంటుంది అనే దాని పైన సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. దాదాపు 20 సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టుకు పెప్సీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్లకు స్పాన్సర్లు ఎగబడి వస్తారు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అయిన నేపథ్యంలో… స్పాన్సర్లు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.

Advertisement

ఒకవేళ స్పాన్సర్ గా ఉన్నా కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని గ్రహించి.. చాలా కంపెనీలు ఇప్పటికే వెనక్కి వెళ్ళాలి. అందుకే తక్కువ ధర చెల్లించినప్పటికీ పెప్సీ ని మాత్రమే స్పాన్సర్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరిస్తుంది. ఈ మధ్యకాలంలో టీసీఎల్ కూడా స్పాన్సర్ గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చింది. ఇది ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ కంపెనీ.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పెప్సీ కంపెనీ మధ్య స్పాన్సర్ షిప్ ఒప్పందాల విలువ కాలక్రమేనా మారుతూ వస్తోంది. ఇటీవల కాలంలో మూడేళ్ల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రూ.46 కోట్ల రూపాయలు పెప్సీ చెల్లించాల్సి ఉంటుంది. జెర్సీ స్పాన్సర్ షిప్ తో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం కూడా పెప్సీ కంపెనీ భారీగానే చెల్లిస్తోంది. వచ్చే మూడు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ సీజ‌న్ల‌ కోసం ఇప్పటికే డీలింగ్ కూడా కుదుర్చుకుంది.

పాకిస్తాన్, బీసీసీఐ మధ్య స్పాన్సర్ షిప్ వ్యత్యాసం ఎంతంటే ?

ప్ర‌పంచంలోనే బీసీసీఐ అత్యంత శ‌క్తివంత‌మైన‌ద‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఇండియాకు స్పాన్సర్ షిప్ లు భారీగానే వస్తాయి. ఈ లెక్క ప్రకారం బీసీసీఐకి వ‌చ్చే స్పాన్సర్ షిప్ లతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లభించే మొత్తాన్ని పోలిస్తే భారీగానే తేడా ఉంటుంది. టీమిండియా ప్రధాన జెర్సీ స్పాన్సర్ షిప్ ద్వారా ఏటా వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అదే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏడాది మొత్తం కొంత మొత్తమే వస్తోంది. మూడేళ్ల‌కు క‌లిపి రూ.46 కోట్లు ల‌భిస్తున్నాయి. ఇత‌ర కంపెనీలు ముందుకు రాక‌పోవ‌డంతో వ‌చ్చిన దాంతోనే సరిపెట్టుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

Big Stories

Advertisement
×