SRH Brydon Carse Arrested: సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH ) ఓనర్ కావ్య పాపకు ( Kavya Maran) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన కీలక ఆటగాడు జైలు పాలయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన ఇంగ్లాండ్ డేంజర్ ఆల్ రౌండర్ బ్రైడన్ కార్స్ ను (SRH Pacer Brydon Carse) పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడికి బేడీలు వేసిన సంఘటన వైరల్ గా మారింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ లో తీవ్ర ఆందోళన నెలకొంది.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లీష్ క్రికెటర్ బ్రైడన్ కార్స్ ను తాజాగా పోలీసులు బేడీలు వేసి అరెస్టు చేశారు. శనివారం అంటే ఆగస్టు 22వ తేదీన డర్బీలోని ఓ నైట్ క్లబ్ బయట ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వీడియో బయటకు వచ్చింది. అయితే దీనిపై ఇంగ్లాండ్ బోర్డు కూడా సీరియస్ అయింది. వెంటనే దీనిపై విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇంగ్లాండ్ డర్బీ లోని ఓ ప్రముఖ నైట్ క్లబ్ బయట బ్రైడన్ కార్స్ ను నలుగురు పోలీసులు చుట్టుముట్టి బేడీలు వేశారు. మొన్న నైట్ క్లబ్ లో బెన్ స్టోక్స్ వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఇందులో బ్రైడన్ కార్స్ కూడా ఉన్నాడని.. అందుకే అతడిని అరెస్టు చేసినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే బేడీలు వేసిన మాట వాస్తవమే కానీ… వెంటనే కార్స్ ను పోలీసులు వదిలేసారని మరి కొంతమంది చెబుతున్నారు. బెన్ స్టోక్స్ వివాదానికి బ్రైడన్ కార్స్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.
క్లబ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బౌన్సర్లతో బ్రైడన్ కార్స్ గొడవ పెట్టుకున్నాడట. ఈ క్రమంలోనే ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెంటనే రియాక్ట్ అయింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని.. త్వరలో వివరాలను బయటకు వెల్లడిస్తామని ప్రకటించింది. కాగా, ఇంగ్లాండ్ వర్సెస్ పాక్ సిరీస్ కు బ్రైడన్ కార్స్ సెలక్ట్ కాలేదన్న సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఆల్ రౌండర్ బ్రైడన్ కార్స్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. 2025 ఐపీఎల్ వేలం సమయంలో కోటి రూపాయలు ఖర్చు చేసి కావ్య పాప అతడిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో 2025 ఐపీఎల్ ప్రారంభం కాగానే బొటన వేలి గాయం చూపించి టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఇక 2026 సీజన్ లో హైదరాబాద్ తరఫున ఆడతాడు అనుకుంటే… మళ్లీ అతనికి చేతి గాయం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మొదటి సీజన్ కూడా ఆడలేదు. దీంతో దిల్షాన్ మధుశంకను తీసుకున్నారు.
English star cricketer & SRH's pacer Brydon Carse got arrested by police & is under investigation now for an incident at night club.
English Cricketer & their stories at nightclub is a tragedy. Harry Brook was beaten by bouncer, Ben Stokes was punched by someone, Ben Duckett…
— Rajiv (@Rajiv1841) August 23, 2026