Yuvraj Singh On Virat Kohli: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి కామెంట్స్ చేసిన యువరాజ్ సింగ్… లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ టార్గెట్ చేశాడు. విరాట్ కోహ్లీకి నిత్యం డబ్బా కొట్టే వాళ్ళు ఉండాలని… అలా డబ్బా కొడితేనే అతడికి నచ్చుతుందని బాంబు పేల్చారు. ఇక టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా ఆటగాళ్లందరూ ఫుట్ బాల్ ఆడితే… విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒక్కడే క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) కంటే పెద్ద ఆటగాడు అన్నట్లుగా ఫీల్ అవుతాడని పరువు తీశారు. కానీ అతనికి అంత సీన్ లేదని హేళన చేశారు యువరాజ్ సింగ్. దీతో విరాట్ కోహ్లీపై యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీని ఉద్దేశించి, టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాక్టీస్ లో భాగంగా ఫుట్ బాల్ చేస్తున్నప్పుడు… క్రిస్టియానో రోనాల్డో లాగా విరాట్ కోహ్లీ ఊహించుకుంటాడని పరువు తీశారు. కానీ రోనాల్డో కు ఉన్నన్ని స్కిల్స్… ఆటతీరు విరాట్ కోహ్లీలో లేవని హేళన చేస్తూ యువరాజు సింగ్ పరువు తీశారు. ఫుట్ బాల్ సెషన్స్ సమయంలో తనకు, యువరాజుకు చాలా సార్లు గొడవలు కూడా జరిగాయని గుర్తు చేసుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ చుట్టూ ఉన్నవాళ్లు అతడి ఆట తీరును పొగడాలని… అలా అయితేనే అతనికి నచ్చుతుందని వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్లతో విరాట్ కోహ్లీ క్లోజ్ గా ఉంటాడని బాంబు పేల్చారు.
2019 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా యువరాజు సింగ్ ను కాదని జట్టును సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. యువరాజ్ సింగ్ ఏజ్ పైబడిందని… అతడు వరల్డ్ కప్ ఆడలేడని విరాట్ కోహ్లీ బోర్డుకు వెల్లడించారట. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ సెలెక్ట్ కాలేదు. అనంతరం రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇక అప్పటి నుంచి విరాట్ కోహ్లీని ఉద్దేశించి యువరాజ్ సింగ్ నిత్యం కామెంట్స్ చేస్తూ ఉంటారు. అతడి కారణంగానే తనకు జట్టులో స్థానం దక్కలేదని కూడా ఈ మధ్యకాలంలో వెల్లడించారు. తాను ఫిట్ గా లేనని, 2019 వన్డే వరల్డ్ కప్ ( 2019 odi world cup )ఆడకుండా కోహ్లీ, రవిశాస్త్రి ఇద్దరూ కుట్ర చేశారని ఆరోపణలు చేశారు యువరాజ్ సింగ్ (yuvi).