E-Paper
Advertisement

ఆ దుర్మార్గుడి వ‌ల్లే, 2019 ప్రపంచ కప్ లో సెమీస్ లో ఓడిపోయాం !

ఆ దుర్మార్గుడి వ‌ల్లే, 2019 ప్రపంచ కప్ లో సెమీస్ లో ఓడిపోయాం !
Advertisement

Ambati Rayudu On 2019 World Cup:  2019 ప్రపంచ కప్ టోర్నమెంట్ (ICC Cricket World Cup 2019) సందర్భంగా టీమిండియా సెమీ ఫైనల్ దాకా వెళ్లి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సెమీ ఫైనల్ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా ఇంటి దారి పట్టింది. ఇదే మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని 50 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. ఆ రనౌట్ కాకపోయి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండి.. వరల్డ్ కప్ టీమిండియా గెలిచేదని సోషల్ మీడియాలో ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే అలాంటి 2019 వన్డే వరల్డ్ కప్ గురించి తాజాగా అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టోర్నమెంట్ సందర్భంగా తనను కాకుండా విజయ్ శంకర్ ను సెలెక్ట్ చేయడంపై మండిపడ్డారు.

అంబ‌టి రాయుడు -3D ప్లేయర్ వివాదం ఏంటి ?

2019 ప్రపంచ కప్ టోర్నమెంట్ గురించి గుర్తు చేసినప్పుడల్లా అంబటి రాయుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో అంబటి రాయుడు అవకాశం మొదటగా ఇచ్చిన బీసీసీఐ.. ఆ తర్వాత అతనిని తప్పించింది. అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్ కే ప్రసాద్ అంబటి రాయుడు కాదని విజయ్ శంకర్ ను 3D ప్లేయర్ గా గుర్తించి మరీ సెలక్ట్ చేశారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

త్రీడీ అంటే.. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ నైపుణ్యాలు కలిగిన ఆటగాడు. అందుకే వరల్డ్ కప్ కిట్లు అందుకున్న కూడా.. చివరి క్షణంలో అంబటి రాయుడు ను పక్కకు పెట్టారు. ఆ సందర్భంగా ప్రపంచ కప్ చూడడానికి త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ ఇచ్చాను అంటూ ఎంఎస్కే ప్రసాద్ నువ్వు ఉద్దేశించి వివాదాస్పదమైన పోస్ట్ కూడా పెట్టారు అంబటి రాయుడు. ఆ తర్వాత అంబటి రాయుడు కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది.

విజ‌య్ శంక‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్లే, టీమిండియాకు ఓట‌మి

Advertisement

2019 ప్రపంచ కప్ టోర్నమెంట్ గురించి తాజాగా మరోసారి అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్షణంలో తనను కాదనడం దుర్మార్గమన్నారు. తాను ఆడే నాలుగవ స్థానంలో విజయ్ శంకర్ ను కాకుండా మరొక ఆటగాడిని తీసుకుంటే తనకు ఇంత బాధ ఉండేది కాదని వెల్లడించారు.

ఆ నాలుగువ స్థానానికి యువరాజు సింగ్, సురేష్ రైనా లేదా అజింక్య రహానే ఈ ముగ్గురిలో ఒకరు కరెక్ట్ గా సరిపోయేవారు. కానీ వీళ్లను కాదని విజయశంకర్ ను తీసుకోవడం తనకు అస్సలు నచ్చలేదని స్పష్టం చేశారు. ఇక సెమీఫైనల్స్ సందర్భంగా కూడా నాలుగవ స్థానంలో సరైన ఆటగాడు లేక ధోనిపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో టీమిండియా ఓడిపోయిందని కూడా గుర్తు చేశారు. ఇలా తనను పక్కకు పెట్టడం వల్ల వరల్డ్ కప్ కోల్పోవాల్సి వచ్చిందని చెప్పే ప్రయత్నం అంబటి రాయుడు చేసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

Big Stories

Advertisement
×