Gautam Gambhir blames MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) వర్సెస్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితిలు ఉంటాయి. మహేంద్ర సింగ్ ధోనీ పై చాలా సార్లు గౌతమ్ గంభీర్ ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011 వన్డే వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం మహేంద్రసింగ్ ధోని కొట్టేసాడని చాలాసార్లు పేర్కొన్నారు గౌతమ్ గంభీర్. కానీ ఇప్పటి వరకు ధోని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అయితే లేటెస్ట్ గా 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సెంచరీ మిస్ కావడంపై కూడా గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోని కారణంగానే సెంచరీ మిస్ చేయడమే కాకుండా, చివరి వరకు ఆడ లేక పోయానని బాంబు పేల్చాడు గౌతమ్ గంభీర్. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ పై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక వర్సెస్ టీమిండియా తలబడ్డ సంగతి తెలిసిందే. ఇందులో చివరి వరకు ఆడిన మహేంద్ర సింగ్ ధోని… సిక్సర్ బాది మ్యాచ్ గెలిపించాడు. దీంతో వరల్డ్ కప్ హీరోగా మారిపోయాడు ధోని. అయితే ఈ మ్యాచ్ లో అంతకుముందే 97 పరుగులు చేసి.. జట్టును గౌతమ్ గంభీర్ కాపాడాడు. కానీ క్రెడిట్ మొత్తం ధోని ఖాతాలో పడింది. అయితే దీనిపైనే తాజాగా గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో 97 పరుగుల వద్ద మహేంద్ర సింగ్ ధోని తనకు కీలక సూచనలు చేశారని గంభీర్ వెల్లడించారు.
కేవలం మూడు పరుగులు చేస్తే నీది సెంచరీ పూర్తి అవుతుంది… వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేయడం ఒక రికార్డుగా నిలుస్తుందని ధోని సలహా ఇచ్చాడట. ఈ క్రమంలో తాను సెంచరీ పైన దృష్టి పెట్టడంతో.. క్లీన్ బౌల్డ్ అయ్యానని వెల్లడించారు. సెంచరీ పైన ఫోకస్ చేసి.. వికెట్ కోల్పోవడానికి కారణం ధోని సలహాలేనని గౌతమ్ గంభీర్ పరోక్షంగా అతనిని తిట్టాడు. అదే ధోని సలహాలు వినకపోయి ఉంటే.. తాను ధోని తరహాలో చివరలో సిక్సర్ కొట్టి మ్యాజిక్ గెలిపించే వాడిందని వ్యాఖ్యానించారు. కానీ ప్లాన్ రివర్స్ అయి… ధోని నే సిక్సర్ కొట్టి హీరో అయ్యాడని మండిపడ్డారు. ఈ తరుణంలోనే 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో ధోని తన ఏకాగ్రతను దెబ్బతీశాడు అంటూ గౌతమ్ గంభీర్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
2011 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ టీం ఇండియా మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చివరి వరకు ఆడిన మహేంద్ర సింగ్ ధోని కొట్టి మ్యాచ్ గెలిపించాడు. దీంతో 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్ టీమిండియా దక్కించుకుంది. ధోని కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు ఇప్పటి వరకు వచ్చాయి. ఓ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దక్కింది.