E-Paper
Advertisement

బీసీసీఐకి ఎదురుదెబ్బ‌..ACC ఎన్నిక‌ల్లో ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం

బీసీసీఐకి ఎదురుదెబ్బ‌..ACC ఎన్నిక‌ల్లో ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం
Advertisement

Asian Cricket Council elections:  ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council ) వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇండియాకు మద్దతు ఇచ్చిన ప్యానల్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) మద్దతు ఇచ్చిన ప్యానల్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మూడు స్థానాలలో పోటీ జరగగా.. ఇందులో ఇండియా మద్దతు ఇచ్చిన ముగ్గురు అభ్యర్థులు ఓడిపోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi) చక్రం తిప్పిన నేపథ్యంలో పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐకి ఎదురుదెబ్బ‌..ACC ఎన్నిక‌ల్లో ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం

ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ బోర్డులో (Asian Cricket Council ) మూడు కీలక స్థానాల కోసం ఇవాళ ఎన్నిక జరిగింది. బ్యాంకాక్ వేదికగా వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించి.. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇందులో పాకిస్తాన్ మద్దతు తెలిపిన ముగ్గురు అభ్యర్థులు గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi) నేతృత్వం వహించిన ప్యానల్ ఈ ఎన్నికల్లో గెలిచింది. మాల్దీవులు, సింగపూర్ అలాగే ఖతార్ దేశాలకు సంబంధించిన ముగ్గురు ప్రతినిధులు గెలిచిన వారిలో ఉన్నారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అటు బీసీసీఐ నేరుగా మద్దతు పలికిన ప్యానల్ అభ్యర్థులు ముగ్గురు కూడా ఓడిపోయారు. ఒక్క సీట్ అయినా గెలవాలని కసిగా పోరాడినప్పటికీ… ప్రతి ఫలం దక్కలేదు. ఈ ముగ్గురు అభ్యర్థులకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకునేందుకు బీసీసీఐ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ… మొహ్సిన్ న‌ఖ్వీ చక్రం తిప్పి అన్ని సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రుణంలో ఇండియాను ఇద్దేశించి, దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు పాకిస్తాన్ వెధ‌వలు.

చక్రం తిప్పిన మొహ్సిన్ న‌ఖ్వీ

Advertisement

ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్యానల్ ఎన్నికల్లో చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ చక్రం తిప్పినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇండియాను ఎలాగైనా ఓడించాలన్న కసితో ఆయన పనిచేశారు. ఈ క్రమంలోనే ఆసియాలోని ఇతర చిన్న క్రికెట్ బోర్డులను ఏకం చేశారు. డబ్బులు ఆశ చూపి…. మూడు ప్యానల్స్ దక్కించుకున్నారు మొహ్సిన్ న‌ఖ్వీ. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చరిత్రలో పాకిస్తాన్ అనుకూల ప్యానెల్ అన్ని స్థానాలను గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది మొహ్సిన్ న‌ఖ్వీ సాధించిన అతిపెద్ద విజయంగా పాకిస్తాన్ సోషల్ మీడియా కూడా వస్తుంది. ఇక ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చే పురుషుల ఆసియా కప్ తో పాటు దుబాయిలో త్వరలో జరగబోయే మహిళల ఆసియా క‌ప్ బడ్జెట్ అలాగే ఏర్పాట్లపై కీలక చర్చ కూడా జ‌రిగింది.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

Big Stories

Advertisement
×