BigTV English

Dhoni : ఆ యాప్ పై ధోని ఎఫెక్ట్.. 3 గంటల్లో 36 లక్షల డౌన్ లోడ్స్..

Dhoni : ఆ యాప్ పై ధోని ఎఫెక్ట్.. 3 గంటల్లో 36 లక్షల డౌన్ లోడ్స్..

Dhoni : ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. క్రికెట్ అభిమానులే కాదు స్టార్ ప్లేయర్స్ నుంచి యంగ్ క్రికెటర్స్ వరకూ చాలామంది మహేంద్రుడిని ఫాలో అవుతారు. అతడేం చేసినా సోషల్ మీడియాలో ట్రెండింగే. ధోని ఓ బ్రాండ్. అతడేం చేసినా ఫాలో అవుతారు.


తాజాగా ఓ సాధారణ ప్రయాణికుడిగా ధోని ఇండిగో విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ల్ ఇస్తుండగా ధోని తన ట్యాబ్ లో క్యాండీ క్రష్ ఆడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియో వచ్చిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీంతో ధోని అభిమానులు ట్విట్టర్‌లో క్యాండీక్రష్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. తమ అభిమాన క్రికెటర్ ధోనీ బాటలోనే చాలామంది క్యాండీ క్రష్ ను ఆడటం మొదలు పెట్టారు.


దీంతో కేవలం 3 గంటల్లోనే 36 లక్షల మంది క్యాండీక్రష్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా క్యాండీ క్రష్ యాజమాన్యం తన అధికారిక పేజీలో పేర్కొంది. మహేంద్రసింగ్ ధోనికి థ్యాంక్స్ చెప్పింది. ధోని కారణంగానే ఇండియాలో తమ సంస్థ ట్రెండింగ్ లోకి వచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

మరోవైపు ప్రత్యేకంగా విమానాలు పెట్టుకొని తిరిగే వారున్న ఈ రోజుల్లో సెలబ్రిటీలకే.. సెలబ్రిటీగా నిలిచిన ధోని ఓ సాధారణ ప్రయాణికుడిలా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు.. ధోని సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×