BigTV English

Babar Azam: అరే.. బాబర్.. క్యా హువా!

Babar Azam: అరే.. బాబర్.. క్యా హువా!

PAK vs BAN Test Match: టీమ్ ఇండియా క్రికెట్ లో విరాట్ కొహ్లీ ఎటువంటి వాడో, పాకిస్తాన్ క్రికెట్ కి బాబర్ ఆజం అలాంటివాడని అంతా అంటారు. అతి కొద్ది కాలంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని, పాకిస్తాన్ క్రికెట్ కి ఒక మూలస్తంభంలా ఎదిగిపోయాడు. మూడు ఫార్మాట్లలో కూడా అద్భుత ప్రతిభ చూపి పాక్ జట్టుకి కెప్టెన్ కూడా అయ్యాడు. తర్వాత ఒడిదుడుకుల మధ్య కెప్టెన్సీ అతనితో దోబూచులాడుతోంది.


ఎంతో కూల్ గా ఉంటూ, ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బాబర్ ఆజం వివాదాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అంతేకాదు భారత్ అంటే తనకెంతో అభిమానం, ప్రేమ అని చెబుతాడు. అన్నింటికి మించి విరాట్ కొహ్లీ తన ఆరాధ్య క్రికెటర్ అని. ఏ మాత్రం భేషజాలు లేకుండా చెబుతాడు. అలాంటివాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ లో వరుసగా విఫలమవుతున్నాడు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 22 పరుగులు మాత్రమే చేసిన బాబర్ ఆజం.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 31, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇప్పుడదే నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది.


Also Read: వాళ్లిద్దరి ప్లేస్ లో.. వీళ్లిద్దరు: దినేశ్ కార్తీక్

నిజానికి తను హాఫ్ సెంచరీ చేసి 20 నెలలు అవుతోంది. రెండేళ్ల క్రితం అంటే 2022లో కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 161 పరుగులు చేశాడు. ఇకంతే…అప్పుడు పోయిన ఫామ్ మళ్లీ, ఇప్పటికి అందుకోలేక పోతున్నాడు. మొన్నటి వరకు టెస్టు ర్యాంకింగుల్లో నెంబర్ వన్ గా ఉన్న బాబర్ ఉన్నట్టుండి.. ఇలా ఆడటంతో 9వ స్థానానికి పడిపోయాడు.

29 సంవత్సరాల బాబర్ ఇంతవరకు 53 టెస్టులు ఆడి 3,920 పరుగులు చేశాడు. 9 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలున్నాయి.
117 వన్డేలు ఆడి 5,729 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
123 టీ 20 లు ఆడి 4145 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2015లో పాకిస్తాన్ జాతీయ జట్టులోకి వచ్చిన బాబర్ ఆజం ఎప్పుడూ వెనుతిరిగి చూసుకోలేదు. తొమ్మిదేళ్ల కాలంలో చాలా వేగంగా ఎదిగాడు. ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఇన్ని వైఫల్యాలున్నా జట్టులో చోటు కోల్పోవడం లేదు. ఇదే మరో ఆటగాడైతే.. ఈ పాటికి శంకరగిరి మాన్యాలు పట్టేవాడే అంటున్నారు.

లాహోర్ లో పుట్టి, ఆ రాష్ట్రానికే కాదు దేశానికే పేరు తెచ్చిన బాబర్ ఆజం తిరిగి ఫామ్ అందుకుని పాకిస్తాన్ జట్టులో పూర్వవైభవాన్ని పొందాలని కోరుకుందాం.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×