BigTV English

Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

Pakistan vs England: పాకిస్తాన్ ( Pakistan) గాడిలో పడినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు వరుసగా ఓటములు ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు… తిరిగి పుంజుకుంది. ఇంగ్లాండ్ జట్టుపై ( England) రెండో టెస్టుల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. ఏకంగా 152 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్. మొదటి టెస్టుల్లో రెచ్చిపోయిన ఇంగ్లాండు బ్యాటర్లను… పాకిస్తాన్ బౌలర్లు దీటుగా ఎదుర్కొని… దాదాపు 1350 రోజుల తర్వాత జట్టుకు విజయాన్ని అందించారు.


Pakistan beats England by 152 runs to level series

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ( Pakistan) … 366 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 221 కి ఆల్ అవుట్ అయింది. అటు ఇంగ్లాండ్ జట్టును కూడా… తక్కువ పరుగులకు కట్టడి చేయగలిగారు పాకిస్తాన్ బౌలర్లు. ఈ తరుణంలోనే ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 291 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 144 పరుగులకే ఆల్ అవుట్ అయింది ఇంగ్లాండ్. దీంతో పాకిస్తాన్ ( Pakistan) 152 పరుగులుతేడాతో విజయం సాధించడం జరిగింది.

Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !


ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన సాజిద్ ఖాన్ కు ( Sajid Khan )… మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో…ప్రత్యేక విషయం ఏంటంటే… ఇద్దరు పాకిస్తాన్ బౌలర్లు ఏకంగా 20 వికెట్లు తీశారు. ఇలా ఇద్దరే.. 20 వికెట్లు తీయడం 52 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. పాకిస్తాన్ బౌలర్లు నావుమాన్ అలీ ( Noman Ali ) 11 వికెట్లు తీయగా… సాజిద్ ఖాన్ 9 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Also Read: Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

మొదటి ఇన్నింగ్స్ లో.. 7 వికెట్లు పడగొట్టిన సాజిద్ ఖాన్ ( Sajid Khan )…రెండవ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయడం జరిగింది. నౌమాన్ అలీ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు పడగొట్టగలిగాడు. ఇలా ఈ ఇద్దరు బౌలర్లు రెచ్చిపోవడంతో… 11 మ్యాచుల తర్వాత అలాగే 1350 రోజుల తర్వాత… సొంత గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసుకుంది పాకిస్తాన్.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×