Pakistan Blind Cricket Team Mock India: అంధుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Blind Asia Cup 2026 Tournament) విజేతగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిలిచింది. బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ అంధుల జట్ల మధ్య ఫైనల్ జరగాల్సి ఉండగా… ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రన్ రేట్ ఆధారంగా లెక్కలు వేసిన మ్యాచ్ రిఫరీలు ఏక పక్షంగా పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది.
అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతున్న క్రమంలోనే.. ఇండియాను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ అంధుల క్రికెటర్లు ప్రవర్తించారు. గతంలో హరీస్ రఫ్ చేసినట్టుగానే ట్రోఫీ అందుకున్న తర్వాత ఇండియాను అవమానిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. భారతదేశానికి సంబంధించిన విమానాలు, జెట్స్ కూల్చేసామంటూ అర్థం వచ్చేలా సైగలు చేస్తూ పాకిస్తాన్ అంధుల క్రికెటర్లు రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై ఇండియన్ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2025 ఆసియా కప్ సందర్భంగా సూపర్ 4 లో భాగంగా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఇండియాలో అవమానిస్తూ హరీస్ రౌఫ్ సెలబ్రేషన్స్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హరీస్ రౌఫ్ ను ఉద్దేశించి కోహ్లీ అభిమానులు టీజింగ్ చేశారు. ఈ క్రమంలో రియాక్టయిన హరీస్ రౌఫ్.. తన చేతి వేళ్ళతో 6-0 అని చూపిస్తూ ఫైటర్ జెట్ కూలిపోతున్నట్టు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ వికెట్ తీసి.. భారత విమానాలను తమ పాకిస్తాన్ కూల్చేసిందని సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
అయితే ఈ మ్యాచ్ లో ఓవరాక్షన్ చేసినందుకు గాను ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. 30% జరిమాన కూడా విధించింది. శుక్రవారం రోజున అంధుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అచ్చం అలాగే ప్రవర్తించారు. దీంతో వాళ్ళ సెలబ్రేషన్స్ పై ఫిర్యాదు చేసేందుకు భారత అంధుల క్రికెట్ జట్టు సిద్ధమైంది. అటు ఇప్పటికే ట్రోఫీ విజేతగా పాకిస్తాన్ ను ప్రకటించడానికి విమర్శిస్తూ… అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాకౌట్ చేసింది ఇండియా. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన తరుణంలో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించకుండా పాకిస్తాన్ కు ట్రోఫీ ఇవ్వడం అంటూ నిరసనకు దిగింది. దీనిపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమైంది.
Pakistan have been crowned champions of the Blind T20 Asia Cup after the final against India was abandoned due to persistent rain. The match referee declared Pakistan the winner, while the national team topped the tournament standings with victories in all three of their league… pic.twitter.com/v9Mgp7Kvxx
— Muneeb Farrukh (@Muneeb313_) November 20, 2026