Shahid Afridi On India blind Team Boycotts Presentation Ceremony: అంధులు ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఛాంపియన్ అయింది. బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా శుక్రవారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టును ఛాంపియన్ గా ప్రకటిస్తూ.. మ్యాచ్ రిఫరీలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లు తెగ సంబరాలు చేసుకున్నారు. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ( Pak Shahid Afridi ) రియాక్ట్ అయ్యాడు. కళ్ళు కనిపించక పోయినా ఆసియా కప్ ఫైనల్లో శత్రు దేశానికి చెందిన టీమిండియా అంధుల జట్టును ఓడించడం గొప్ప విషయం అన్నాడు. అద్భుతమైన రన్ రేట్ సాధించిన నేపథ్యంలోనే విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు. టీమిండియా జట్టును వెనక్కి నెట్టి చాంపియన్ గా నిలిచిన అందులో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అండగా నిలవాలని డిమాండ్ చేశాడు. ఈ టోర్నమెంట్ ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్ కు కోటి పాకిస్తాన్ రూపాయల (భారత కరెన్సీలో రూ.34 లక్షలు అన్న మాట) చొప్పున ఇవ్వాలని కోరాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు తాను కూడా ఒక్కో ఆటగాడికి రూ.10 లక్షల పాకిస్తాన్ రూపాయల ( (భారత కరెన్సీలో రూ.4 లక్షలు) చొప్పున నజరానా అందిస్తానని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ జట్టు అభివృద్ధికి తాను తోడ్పడుతానని వెల్లడించాడు. అవసరమైతే పాకిస్తాన్ అంధుల జట్టుకు ట్రైనింగ్ కూడా ఉచితంగానే ఇస్తానని సంచలన ప్రకటన చేశాడు. అంధుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలవడంతో భారతీయులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డాడు.
ఈ టోర్నమెంట్ లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు మెరుగైన రన్ రేట్ సంపాదించిందని గుర్తు చేశాడు. అందుకే రన్ రేట్ ఆధారంగా జట్టును విజేతగా ప్రకటించారు అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి దౌర్జన్యం జరగలేదని… న్యాయంగానే తమ జట్టుకు ట్రోఫీ దక్కిందని తెలిపాడు. ఆసియా కప్ అనగానే బాయ్ కాట్ చేయడం టీమిండియా కు అలవాటైపోయిందని నిప్పులు చెరిగాడు. న్యాయంగా గెలిచిన పాకిస్తాన్ జట్టుకు మరోసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో అంధుల పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.