E-Paper
Advertisement

జైస్వాల్ 20 ప‌రుగులు దాటితే..నా అకౌంట్ డిలీట్ చేస్తానంటూ బాబర్ ఆజం అభిమాని ట్వీట్!

జైస్వాల్ 20 ప‌రుగులు దాటితే..నా అకౌంట్ డిలీట్ చేస్తానంటూ బాబర్ ఆజం అభిమాని ట్వీట్!
Advertisement

Babar Azam Fan On Yashasvi Jaiswal:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal) బ్యాటింగ్ పై బాబర్ ఆజం అభిమాని (Babar Azam Fan) సంచలన పోస్ట్ పెట్టాడు. ఇవాళ ఉదయం టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు… యశస్వి జైస్వాల్ 20 పరుగులు దాటితే తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేస్తానని ప్రకటించాడు. అలా చేయకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నానంటూ వెల్లడించాడు. అయితే బాబర్ ఆజం అభిమాని చేసిన ట్వీట్ టీమిండియా కుర్రాడు యశస్వి జైస్వాల్ చూశాడా? లేక ఊపు వ‌చ్చిందో? తెలీదు కానీ… న్యూజిలాండ్ పై మొదటి ఇన్నింగ్స్ లో రెచ్చిపోయి ఆడాడు.

సెంచ‌రీ మిస్ చేసుకున్న‌ యశస్వి జైస్వాల్

వెల్లింగ్ట‌న్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ సందర్భంగా 89 బంతుల్లో 85 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లకు యశస్వి జైస్వాల్ చుక్కలు చూపించాడు. 16 బౌండరీలతో.. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా జాకబ్ డఫ్పీ బౌలింగ్ లో బౌండరీల మీద బౌండరీలు కొట్టి నరకం చూపించాడు. దురదృష్టవశాత్తు మాట్ హెన్రీ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో సెంచరీ మిస్ చేసుకుని డగౌట్ లో కూర్చున్న టీమిండియా కుర్రాడు యశస్వి జైస్వాల్.. ఇప్పుడు బాధపడుతున్నాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

యశస్వి జైస్వాల్ ఊచ‌కోత‌.. మాట మార్చిన బాబర్ అభిమాని

తొలి ఇనింగ్స్ లో 20 పరుగులు కాదు 85 పరుగులు యశస్వి జైస్వాల్ సాధించడంతో బాబర్ ఆజం అభిమాని మాట మార్చాడు. తాను ఎంత ప్రయత్నించిన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు చేయడం మొదలు పెట్టాడు. డిలీట్ చేస్తే ఎర్రర్స్ వస్తున్నాయని నాటకాలు దొబ్బుతున్నాడు. ఛాలెంజ్ ఓడిపోయానని ఒప్పుకున్నా బాబర్ ఆజం అభిమాని…ట్విట్ట‌ర్ స్థానంలో తన వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసినట్టు పోస్ట్ పెట్టాడు. అలాగే 85 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్, 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతాడని వెల్లడించాడు. రోహిత్ శర్మను పక్కకు పెట్టి యశస్వి జైస్వాల్ ను తీసుకుంటారని మెచ్చుకునే ప్రయత్నం చేశాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా.. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టెస్ట్ రెండో రోజు విజయవంతంగా ముగిసింది. మొదటి రోజు న్యూజిలాండ్ పై చేయి సాధించగా… రెండో రోజు టీమిండియా బ్యాటర్లు ఉతికారేశారు. యశస్వి జైస్వాల్ 85 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్ 52 పరుగులతో ఇరగదీశాడు. 39 ఓవర్లు ఆడిన టీమిండియా ఒకే ఒక్క వికెట్ నష్టపోయి 159 పరుగులు సాధించింది. ప్రస్తుతం కఎల్ రాహుల్, ప‌డిక్క‌ల్ బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ కంటే మరో 209 పరుగులు టీమిండియా వెనకబడింది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

?utm_source=ig_web_copy_link&fqnt=NTc4MTIwNjQ2YQ==

Related News

న‌వంబ‌ర్ 22న పాకిస్తాన్ ఓడిపోతే.. టీమిండియా జెర్సీ వేసుకుని స‌లాం కొడ‌తా

గంభీర్ నీకు బుర్ర ఉందా? సిరాజ్‌, జ‌డేజాల‌ను ఎలా ప‌క్క‌కు పెడ‌తావ్

టీమిండియాను ఓడిస్తామ‌ని లిఫ్ట్ లోనే భువ‌నేశ్వ‌ర్ కు నా కొడుకు వార్నింగ్ ఇచ్చాడు

బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసి నాకు రాహుల్ ద్రవిడ్ సాయం చేశాడు..పాక్ క్రికెట‌ర్ సంచ‌ల‌నం!

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు

100 జన్మలు ఎత్తినా ఐపీఎల్‌ను PSL దాటలేదు.. క్వెట్టా గ్లాడియేటర్స్ ఓనర్ నదీమ్ సంచలనం

Big Stories

Advertisement
×