BigTV English

PAK vs AUS Test : తీరు మారని పాక్.. 24 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఓడిపోతూనే ఉన్న పాకిస్తాన్..

PAK vs AUS Test : తీరు మారని పాక్.. 24 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఓడిపోతూనే ఉన్న పాకిస్తాన్..
PAK Vs AUS Test

PAK vs AUS Test : ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ గెలిచి ఇప్పటికి 24 ఏళ్లు అయ్యింది. 1995లో జరిగిన టెస్టు మ్యాచ్ లో గెలవడమే, మళ్లీ ఇప్పటి వరకు లేదు. దీంతో మీరు మారరా? అంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1999 నుంచి చూస్తే ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో జరిగిన 14 టెస్టు మ్యాచ్ ల్లో పాక్ ఓటమిపాలైంది. కనీసం ‘డ్రా’ కూడా చేయలేకపోయింది. ప్రస్తుతం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్  360 పరుగుల భారీ తేడాతో  ఓడి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.


ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందేమిటంటే పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 271 పరుగులు చేసింది. అదే రెండో ఇన్నింగ్స్ కి వచ్చేసరికి కేవలం 89 పరుగులకే చాప చుట్టేసింది. దీనిపై నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఎప్పుడూ ఇండియా మీద ఏడవడం కాదు, అప్పుడప్పుడు మీవాళ్ల ఆట తీరుని చూసి కూడా కామెంట్ చేస్తూ ఉండండి అని చురకలు అంటిస్తున్నారు.

పాక్- ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా తొలిటెస్ట్ మ్యాచ్ పెర్త్ లో జరిగింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఆఖరి సిరీస్ ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ 164 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ (90) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 487 పరుగులు చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులకు ఆస్ట్రేలియా డిక్లేర్ చేసి, 450 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది.


పాక్ బౌలర్లలో ఆమిర్ జమల్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. అయితే పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఇమాముల్ హక్ (62), షఫీకి (42) మినహా ఎవరూ రాణించలేదు. మొత్తానికి పడుతూ లేస్తూ 271 పరుగులకే ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సయ్యద్ షకీల్ ఒక్కరే 24 పరుగులు చేశాడు.

ఇకపోతే తాజా మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 21, సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో దాదాపు 360 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ మారినా పాక్ జట్టు పరిస్థితి మారలేదని నెట్టింట ట్రోలింగ్ లు మొదలయ్యాయి.

ఆస్ట్రేలియా బౌలర్లలో రెండో ఇన్నింగ్స్ లో   జోష్ హేజిల్ వుడ్ 3, స్టార్క్ 3, కమిన్స్ 1 వికెట్లు తీశారు. అయితే నాథన్ లయాన్ 2 వికెట్లు పడగొట్టి 500 వికెట్ల క్లబ్ లో చేరాడు.

Related News

Asia Cup 2025: ఆసియా కప్ కోసం డేంజర్ బౌలర్లను దించుతున్న టీమిండియా.. ఇక ప్రత్యర్ధులకు పీడ కలలే

Harbajan Singh: ఇండియన్ ఆర్మీని చంపిన పాకిస్తాన్ కొడుకులతో క్రికెట్ ఆడుదామా..? బీసీసీఐకి హర్భజన్ వార్నింగ్

Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Big Stories

×