India vs Pakistan : ఏదైనా కింగ్ అంటే కింగే.. కోహ్లి అంటే కోహ్లి.. పాకిస్తాన్ లో క్రికెట్ ను ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఇండియా జట్టును చూసి భయపడరు. ఒక్క కోహ్లిని చూసి భయపడతారు. అంతకుముందు సచిన్ అంటే భయం ఉండేది కాదుగానీ అభిమానం ఉండేది. తను 16 ఏళ్ల వయసులోనే క్రికెట్ లో అడుగుపెట్టడంతో అందరూ చిన్నవాడిగానే చూసేవారు. ఇలాంటి వాడు ఒక్కడు పాకిస్తాన్ లో ఉంటే ఎంత బాగుండేది అనుకునేవారు. ఆ తరహాలోనే ఆలోచనలు చేసేవారు. నిజంగా సచిన్ ఆడితే వారు సంతోషపడేవారు. ప్రజలే కాదు పాక్ ఆటగాళ్లు కూడా సచిన్ పట్ల ప్రేమాభిమానాలతో ఉండేవారు.
అది మాస్టర్ సంపాదించుకున్న అభిమానం. కానీ కోహ్లి అలా కాదు.. క్రీజ్ లోకి వచ్చాడంటే సింహంలా గర్జిస్తాడు. దేశం కోసం కసితో ఆడతాడు. ఒక పట్టుదలతో ఉంటాడు. ఒక సైనికుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కోహ్లిలో ఉన్నాయి. అందుకే ఛేజింగ్ లో గానీ ఇండియా ఉందంటే, అక్కడ కోహ్లి అవుట్ కాలేదంటే ప్రత్యర్థి జట్టు మ్యాచ్ మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అంత గొప్ప ట్రాక్ రికార్డ్ కోహ్లి సొంతం.
ఛేజింగ్ లో విరాట్ టెస్ట్, వన్డేలు కలిపి 42 సెంచరీలు చేశాడు. 26 వన్డేలు, 16 టెస్ట్ మ్యాచ్ ల్లో ఈ ఫీట్ సాధించాడు. 36 ఆఫ్ సెంచరీలు కూడా చేశాడు. తను సెంచరీలు చేసిన దాదాపు 95 శాతం మ్యాచుల్లో ఇండియా గెలిచింది. టీ 20ల్లో అయితే 20కి పైగా ఆఫ్ సెంచరీలు ఛేజింగ్ లో చేశాడు. సచిన్ టెండుల్కర్ అయితే ఛేజింగ్ లో వన్డే, టెస్టుల్లో కలిపి 35 సెంచరీలు మాత్రమే చేశాడు.
అయితే కోహ్లి కొన్ని గుర్తుండిపోయే మ్యాచ్ ల్లో అయితే పాకిస్తాన్ పై చేసిన 183 పరుగుల ఛేజింగ్ రికార్డ్ ఉంది. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఓడిపోతున్న ఇండియా మ్యాచ్ ను నిలబెట్టి.. ఆఖరి ఓవర్లలో అద్భుతమైన సిక్సర్లు కొట్టి ఇండియాకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఇలాంటివే పాక్ క్రికెట్ అభిమానులకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
అందుకే వాళ్లేమని అనుకుంటారంటే కోహ్లి ఒక్కడు త్వరగా అయిపోవాలని కోరుకుంటారు. కానీ మనవాడు ఛేజింగ్ లో కింగ్ అనే సంగతి వారు మరిచిపోతుంటారు. కోహ్లి జట్టులో ఉన్నంత కాలం పాకిస్తాన్ అభిమానులు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే టీవీల్లో వారు మ్యాచ్ లు చూస్తూ.. కోహ్లి.. కోహ్లి అని తలచుకుంటూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఎన్నో కనిపిస్తాయని చెబుతున్నారు. అదీ కొహ్లీ అంటే మరి…
కోహ్లితో గేమ్సా…ఛాన్సే లేదు…మరి మీరేమంటారు..