Pak on Vaibhav Suryavanshi: అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) నిన్న ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ( England U19 vs India U19, Final ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుపై 100 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు వైభవ్ సూర్య వంశీ. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ పై పాకిస్తాన్ ( Pakistan man ) అభిమాని సంచలన వీడియో చేశారు. వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi) అసలు మనిషి కాదని.. వాడు రాక్షసుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది.
ఐసీసీ అండర్ 19 ను వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026 ) భాగంగా టీమిండియా ఫైనల్స్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ను దారుణంగా ఓడించిన టీమిండియా ఆరవ సారి చాంపియన్ అయింది. ఈ తరుణంలో ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా రాణించాడు. 80 బంతుల్లో ఏకంగా 175 పరుగులు సాధించాడు వైభవ్ సూర్య వంశీ. ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా 50 ఓవర్లు ఆడి, తొమ్మిది వికెట్లు రాసిపోయిన టీమ్ ఇండియా అండర్ 19 జట్టు 411 పరుగులు సాధించింది.
ఈ సందర్భంగా 15 సిక్సర్లు అలాగే 15 బౌండరీలతో రెచ్చిపోయాడు వైభవ్ సూర్య వంశీ. ఫైనల్ మ్యాచ్లో ఇలాంటి భయంకరమైన ఇన్నింగ్స్ ఆడిన తొలి ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. దీంతో సోషల్ మీడియాలో వైభవ్ సూర్య వంశీ పేరు మారుమవుతోంది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి షాకింగ్ వీడియో పెట్టారు. 175 పరుగులు కొట్టడం చాలా అరుదు అని చెప్పారు. వాడు మనిషి కాదు రాక్షసుడు అంటూ బాంబు పేల్చారు.
ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ( ICC Under 19 World Cup 2026 ) గెలిచిన టీమ్ ఇండియా జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) భారీ నజరానా ప్రకటించింది. టీమిండియా జట్టుకు ( Team India) 7.5 కోట్ల నజరానా ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ డబ్బును టీమిండియా ప్లేయర్లు, స్టాఫ్, సిబ్బంది, కోచ్ లకు ఇవ్వనున్నారు.
?utm_source=ig_web_copy_link