E-Paper
Advertisement

Mohammad Amir: రాసి పెట్టుకోండి.. త‌ల‌కిందులుగా త‌ప్ప‌స్సు చేసినా, టీమిండియా సెమీ ఫైనల్స్ చేర‌దు

Mohammad Amir: రాసి పెట్టుకోండి.. త‌ల‌కిందులుగా త‌ప్ప‌స్సు చేసినా, టీమిండియా సెమీ ఫైనల్స్ చేర‌దు
Advertisement

Mohammad Amir:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Pakistan Mohammad Amir ). తలకిందులు తపస్సు చేసిన కూడా సెమీ ఫైనల్స్ ( T20 World Cup semi-finals) దాకా టీమిండియా ( Team India) వెళ్లే ఛాన్స్ లేద‌ని బాంబు పేల్చారు. రాసి పెట్టుకోండి… సూపర్ 8 స్టేజ్ లోనే చిత్తు చిత్తుగా ఓడిపోయి టీమ్ ఇండియా ఇంటిదారి పడుతుందని హెచ్చరించారు. టీమిండియా పూర్తిగా ఒత్తిడిలో ఉందని… ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఓడిపోవడం గ్యారంటీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

త‌ల‌కిందులుగా త‌ప్ప‌స్సు చేసినా, టీమిండియా సెమీ ఫైనల్స్ చేర‌దు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికే సూపర్ 8 చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజ్ లో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసుకున్న టీమిండియా, తొడకొడుతూ సూపర్ 8 లో అడుగు పెట్టింది. ఇక రేపటి నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. ఇలాంటి నేపథ్యంలో టీమిండియాపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మహమ్మద్ అమీర్. 2026 టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లడం సాధ్యం కాదని బాంబు పేల్చారు. ప్రస్తుతం టీమిండియా ఒత్తిడిలో ఉందని, జింబాబ్వే లాంటి జట్టు చేతిలో కూడా ఓడిపోయే ప్రమాదం ఉందన్నారు.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ పైన మినహా మిగిలిన చిన్న జట్ల పైన ఆడినప్పుడు టీమిండియా పెద్దగా రాణించలేదని.. బ్యాటర్లందరూ సూపర్ 8లో చేతులెత్తేయడం గ్యారెంటీ అంటూ జోస్యం చెప్పారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్. ఇక సూపర్ 8 లో కచ్చితంగా టీమిండియా ప్లేయర్లు ఒత్తిడిలోకి వెళ్తారని.. దీనివల్ల ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ సరిగ్గా లేదని విమర్శలు చేశారు. ఎప్పుడు కుప్పకూలేది తెలియదన్నారు. అభిషేక్ శర్మ ఇప్పట్లో రాణించడం కష్టమేనని.. అతని కెరీర్ ముగిసిందని మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంచనా ప్రకారం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా రెండు జ‌ట్లు కూడా గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్ వెళ్తాయని పేర్కొన్నారు.

టీమిండియా సూప‌ర్ 8 మ్యాచ్ లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూప‌ర్ 8 నేపథ్యంలో టీమిండియా మొత్తం మూడు మ్యాచ్ లు ఆడ‌నుంది. మొద‌ట ద‌క్షిణాఫ్రికాతో ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన‌ ఆడ‌నుంది టీమిండియా. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఇక చివ‌ర‌కు మార్చి 1వ తేదీన వెస్టిండీస్ తో ఆడ‌నుంది టీమిండియా.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

 

 

 

 

 

Related News

సంజు మాస్టర్ మైండ్..రెండో టీ20లోనూ టీమిండియా విక్టరీ, సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్

0, 0, 0, 0, 0, 0 బుమ్రా మరో వరల్డ్ రికార్డు..మనోడిని కొట్టే మొనగాడే లేడుగా

అల్లా మీద ఒట్టు…2027ప్రపంచ కప్‌లో టీమిండియాను ఇంటికి పంపిస్తా

గంభీర్‌ దిక్కుమాలిన నిర్ణయాలతో, నా భార్యకు విడాకులు ఇచ్చేలా ఉంది !

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

నన్ను వాడుకొని వదిలేశారు..కావ్య పాపపై భువీ ఫైర్ !

మొహ్సిన్ నఖ్వీ సీటుకు ఎసరు…తమీమ్ ఇక్బాల్‌ తో కలిసి BCCI స్కెచ్ !

నఖ్వీతో బీసీసీఐ పెద్దలు రాసుకు పూసుకు తిరగొచ్చు, కానీ ట్రోఫీ ఇస్తే ఉగ్రవాదమా ?

Big Stories

Advertisement
×