IND VS SA: భారత మహిళల జట్టు 47 సంవత్సరాల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మహిళా జట్టును 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. ఈ క్రమంలో తొలి వరల్డ్ కప్ టైటిల్ ని ముద్దాడింది. మూడవసారి వరల్డ్ కప్ ఫైనల్ కి దూసుకువెళ్లి.. ఎట్టకేలకు కప్ ని ఒడిసిపట్టింది. కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్షను నెరవేరుస్తూ.. బలమైన సౌత్ ఆఫ్రికా జట్టును ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
Also Read: Smriti Mandhana: ప్రియుడి కౌగిలిలో స్మృతి మందాన… దారుణంగా ఆడుకుంటున్న ఫ్యాన్స్ ?
ఈ విజయం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు మహిళా జట్టును ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. ఇదే సందర్భంలో ఫైనల్ మ్యాచ్ లో రన్నరప్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు పోరాటాన్ని కూడా ప్రపంచం కొనియాడింది. అయితే తమ జట్టు రన్నరప్ గా నిలవడంతో ప్రముఖ సౌత్ ఆఫ్రికా నటి స్పందించింది.
సౌత్ ఆఫ్రికా కి చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత మహిళల జట్టుపై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తంజా ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. “భారతీయ అభిమానులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మా దేశపు మహిళా క్రికెట్ జట్టుకు ఎందుకు లభించడం లేదు. భారతీయులు వారి జట్టుకు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు దక్కకపోవడం ఆవేదన కలిగిస్తుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత పురుష మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ.. వారి మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారు. మరి సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ..? మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చు. సౌత్ ఆఫ్రికా క్రీడ మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మహిళల క్రీడల పట్ల మన దేశ వైఖరిని తెలియజేస్తోంది.
ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ఓటమిపాలైనప్పటికీ తంజా.. భారత జట్టు పోరాటాన్ని, ఆటతీరును ప్రశంసించింది. ముఖ్యంగా స్మృతి మందాన సహా భారత మహిళా క్రికెటర్లు చాలా బాగా ఆడారని కొనియాడింది. వారికి ప్రజల మద్దతు బాగా కలిసి వచ్చిందని తెలిపింది. ఏది ఏమైనా మీరు ప్రపంచకప్ విజేతలు అని.. మీరు దానికి అర్హులు అని భారత మహిళా జట్టును ప్రశంసించింది. అలాగే దేశం గర్వించే క్షణాల్లో కూడా తమ దిగ్గజ క్రీడాకారులు, అధికారులు.. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుకు రాకపోవడం బాధాకరమని వెల్లడించింది.
Also Read: Hardik Pandya: ఛాంపియన్ గా టీమిండియా.. ముంబై వీధుల్లో గంతులు వేసిన హర్ధిక్ పాండ్యా
ఫైనల్ మ్యాచ్ కి సౌత్ ఆఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ ఎబి డివిలియర్స్, జాక్వస్ కల్లిస్, స్మిత్ లాంటి వారెవరు స్టేడియంలో కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబి డివిలియర్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ జరిగిన సమయంలో ఆర్సిబి జట్టుకు సపోర్ట్ చేస్తూ ఫైనల్ మ్యాచ్ కి వచ్చాడు. కానీ మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ లో కనిపించకపోవడంతో అతనిపైనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో తంజా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AB de villiers have time to fly to Ahmedabad to support a league team RCB in finals but can't fly to Mumbai to support his own nation women's team.
Shame is on you @ABdeVilliers17pic.twitter.com/uzB2MrKV0G
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) November 3, 2025