BigTV English

Pakistan Player: వరల్డ్ కప్ 2023 సాక్షి గా అత్తగారింటి ఆతిథ్యం అందుకోనున్న పాక్ ప్లేయర్

Pakistan Player: వరల్డ్ కప్ 2023 సాక్షి గా అత్తగారింటి ఆతిథ్యం అందుకోనున్న పాక్ ప్లేయర్

Pakistan Player: రేపటితో ఇండియా వేదికగా ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ గెలవడం కోసం వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ పోటీ పడుతున్నాయి. అయితే ఒక్క ప్లేయర్ మాత్రం ఈ అవకాశాన్ని తన కుటుంబంతో కలవడానికి ఉపయోగించుకోబోతున్నాడు. మ్యాచ్ తో పాటు ఆడెడ్ బోనస్ లా అతనికి ఇలాంటి అవకాశం కలిసి వచ్చింది మరి. ఎందుకంటే ఈ మెగాటొర్నీ పుణ్యమా అని ఆ ప్లేయర్ భార్య భారత్ లో ఉన్న తన కుటుంబాన్ని కలిసే అవకాశం ఉంది.


2019 ఆగస్టు 20వ తారీఖున పాక్ ప్లేయర్ హసన్ అలీ దుబాయ్ లో భారతీయ ఫ్లైట్ ఇంజనీర్ అయిన సమియా అర్జూను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్ 6వ తారీఖున వారికి అమ్మాయి పుట్టింది. అయితే 2019లో పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఇప్పటివరకు హాసన్ అలీ భార్య సమియా హర్యానాలోని తన ఇంటికి వెళ్ళలేకపోయింది. తన కూతుర్ని, మనవరాలని ఫోటోలో చూసుకోవడమే తప్ప నేరుగా చూడడానికి నోచుకోని ఆ 63 ఏళ్ల తాత వరల్డ్ కప్ 2023 పాక్ జట్టును ప్రకటించేంతవరకు భయంతో నిరీక్షించాడు.

ఆసియా కప్‌లో నసీం షా గాయానికి గురికావడంతో హసన్ అలీని చివరి నిమిషంలో ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం జరిగింది. ఇది ఆ ప్లేయర్ కే కాక అతని కుటుంబానికి కూడా ఎంతో తీయనైన వార్తగా మారింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసన్ అలీ మామ లియాకత్ తన కూతురు, అల్లుడు ,మనవరాలు ఇప్పటికైనా చెందేనిలో తమ ఇంటిని చూడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరికితే బాగుంటుందని, దానికి తన అల్లుడు సహకరిస్తే మరింత బాగుంటుందని అన్నారు.


మొత్తానికి ఐసీసీ వరల్డ్ కప్ పుణ్యమా అని తన కుటుంబాన్ని కలవాలి అని తపిస్తున్న హసన్ అలీ భార్య కోరిక తీరనుంది. అంతేకాదు సామియా కుమార్తె హెలెనా మొట్టమొదటిసారిగా భారత్ లో ఉన్నటువంటి ఆమె తాతను కలవబోతోంది. తన మనవరాలను ఎత్తుకోవడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని, ఇన్ని రోజులకు తన కల నెరవేరబోతోందని లియాకత్ ఆనందిస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత 2021లో సామియా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక్కసారి తన కుటుంబాన్ని కలుసుకుంది. మొత్తానికి సడన్ గా వచ్చిన ఛాన్స్ వల్ల హసన్ అలీతో పాటు అతని కుటుంబానికి కూడా ఈ టోర్నమెంట్ మంచి మెమొరబుల్ ఈవెంట్ గా మిగులుతుంది. అయితే అతని మామ అడిగినట్టు హసన్, విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసిస్తాడో లేదో చూడాలి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×