E-Paper
Advertisement

SRH ఓన‌ర్ కావ్య పాప పెళ్లి…వాళ్లంద‌రికీ ఖ‌రీదైన‌ గోల్డ్ రింగులు!

SRH ఓన‌ర్  కావ్య పాప పెళ్లి…వాళ్లంద‌రికీ ఖ‌రీదైన‌ గోల్డ్ రింగులు!
Advertisement

Kavya Maran Gifted Gold Rings:  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH ) ఓనర్ కావ్య పాప (Kavya Maran).. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ( Anirudh) వివాహం ఇటీవల జరిగింది. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఈ పెళ్లి నేపథ్యంలో సన్ గ్రూప్ ఉద్యోగులందరికీ కావ్య పాప బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ బంగారు ఉంగరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

SRH ఓన‌ర్ కావ్య పాప పెళ్లి…వాళ్లంద‌రికీ ఖ‌రీదైన‌ గోల్డ్ రింగులు!

ఉద్యోగులతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్లకు కూడా ఈ బహుమతులు అందినట్టు సమాచారం అందుతోంది. మొదట కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులకే ఈ బంగారు ఉంగరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కావ్య పాప ఫ్యామిలీ… రెండు రోజుల కింద‌ట‌ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని అంటున్నారు. దగ్గరి వాళ్ళకే కాకుండా కంపెనీ కోసం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ బంగారు ఉంగరాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఉద్యోగులందరికీ శుక్ర‌వారం గోల్డ్ రింగ్స్‌ అందినట్లు తెలుస్తోంది. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్లకు కూడా శ‌నివారం జ‌రిగే రిసెప్షన్ సందర్భంగా ఈ బంగారు ఉంగరాలు అందించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

శ‌నివారం సాయంత్ర‌మే కావ్య పాప – అనిరుధ్ రిసెప్ష‌న్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH Team ) ఓనర్ కావ్య పాప (Kavya Maran).. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) వివాహం నవంబర్ 11వ తేదీన జరిగింది. ఈ వేడుక గ్రీస్ దేశంలోని ఓ ప్రైవేట్ ప్యాలెస్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు రజినీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. కావ్య పాప‌, అనిరుధ్ వివాహం జరిగి పది రోజులు అయిన నేపథ్యంలో శనివారం అంటే నేడు గ్రాండ్ గా వివాహ విందు కూడా నిర్వహించబోతున్నారు.

Advertisement

చెన్నైలో ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా ఇవాళ‌ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రిసెప్షన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, అంతర్జాతీయ క్రికెట్ ప్రముఖులు, సినీ తారలు హాజరు కాబోతున్నారు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్లు, కోచింగ్ స్టాఫ్స్‌, మాజీ ఆట‌గాళ్లు కూడా రానున్నారు. ఈ మేరకు చెన్నై లో భారీ భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

10 కిలోలు త‌గ్గితేనే టీమిండియాలోకి తీసుకుంటామ‌ని గంభీర్ టార్చ‌ర్ పెట్టాడు!

ఇండియాను ఎగ‌తాళి చేస్తూ పాకిస్తాన్ అంధుల క్రికెట‌ర్ల సెల‌బ్రేష‌న్స్‌..హరీస్ రౌఫ్ ను మించిపోయేలా

కంటిచూపు లేకపోయినా ఫైనల్‌లో టీమిండియాను ఓడించారు.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే

బలహీన నేపాల్‌ను ఓడించి సంబర పడిపోకండి.. నవంబర్ 22న నరకం చూపిస్తాం

అంధుల ఆసియా కప్ ఫైనల్‌లో WBCC ఛీటింగ్…టైటిల్ విజేతగా పాకిస్తాన్, బాయ్‌కాట్ చేసిన టీమిండియా

జైస్వాల్ 20 ప‌రుగులు దాటితే..నా అకౌంట్ డిలీట్ చేస్తానంటూ బాబర్ ఆజం అభిమాని ట్వీట్!

న‌వంబ‌ర్ 22న పాకిస్తాన్ ఓడిపోతే.. టీమిండియా జెర్సీ వేసుకుని స‌లాం కొడ‌తా

Big Stories

Advertisement
×