Gambhir Autograph On MSD Jersey: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 1st Test) మధ్య వెల్లింగ్టన్ వేదికగా (Basin Reserve, Wellington) తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్ లో ఇప్పటికే మూడు రోజుల ఆట ఫినిష్ అయింది. అయితే మూడో రోజున ఆట ప్రారంభం కంటే ముందు స్టేడియం బయట ఉన్న ఇండియన్ అభిమానులకు టీమిండియా హెడ్ కోర్టు గౌతమ్ గంభీర్ ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. వరుసగా ఆటోగ్రాఫ్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లిన గంభీర్ పొరపాటున మహేంద్ర సింగ్ ధోని ఎల్లో జెర్సీపై ఆటోగ్రాఫ్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వీటిని చూసిన క్రికెట్ అభిమానులు.. ధోని లాంటి గొప్ప క్రికెటర్ ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని.. అందుకే గంభీర్ లాంటి వ్యక్తి కూడా అతని జెర్సీపై ఎంతో ఇష్టంగా సంతకం పెట్టాడని రియాక్ట్ అవుతున్నారు. అలవాటులో పొరపాటుగా ధోని జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి ఉంటాడని, గంభీర్ తగ్గే మనిషి కాదంటూ మరి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. అంత మందిలో ధోని జెర్సీపై సంతకం పెట్టకపోతే.. ట్రోల్ చేస్తారనే భయంతో గంభీర్ పెట్టి ఉంటాడని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో మూడోరోజు ఆట కొనసాగుతున్న సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ ఫ్రక్షేషన్ లో కనిపించిన వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. అంతేకాదు తలకు మసాజ్ చేయించుకుంటూ గంభీర్ కల్పించాడు. మహేంద్ర సింగ్ ధోని జెర్సీపై సంతకం ఎందుకు చేశాను రా బాబు అంటూ లోలోపల గంభీర్ మదన పడ్డాడని.. దీంతో అతనికి తలనొప్పి వచ్చిందంటూ నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. ధోని వల్లే వచ్చిన తలనొప్పి భరించలేక మసాజ్ కూడా చేయించుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. ధోనితో పెట్టుకుంటే.. శత్రువులకు ఇలాంటి గతే పడతాయని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు.
గౌతమ్ గంభీర్, మహేంద్రసింగ్ ధోని మధ్య నేరుగా ఇప్పటి వరకు ఎలాంటి గొడవ జరగలేదు. కానీ 2011 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా చివరి బంతికి ఫిక్సర్ కొట్టి ధోని హీరోగా మారాడు. అదే మ్యాచులో 97 పరుగులు చేసి గౌతమ్ గంభీర్ కూడా అదరగొట్టాడు. కానీ చివరి బంతికి ధోని సిక్సర్ కొట్టడంతో గంభీర్ ను మర్చిపోయిన క్రికెట్ ఫ్యాన్స్..
వరల్డ్ కప్ తెచ్చింది ధోనీనే అంటూ భజన చేశారు. ఈ క్రమంలోనే గతంలో ధోని పై గౌతమ్ గంభీర్ పరోక్షంగా విమర్శలు చేశాడు. గంభీర్ ఎన్ని విమర్శలు చేసినా ధోని మాత్రం పట్టించుకోలేదు.
Gambhir giving autograph on MSD Jersey 😎💛#MSDhoni pic.twitter.com/wWtUglCvr0
— Chakri (@cricchakri) November 21, 2026