BigTV English

Manu Bhaker: మనుబాకర్ ద్వారా మరొకటి.. వస్తుందా?

Manu Bhaker: మనుబాకర్ ద్వారా మరొకటి.. వస్తుందా?

Manu bhaker Sarabjot Singh at Paris Olympics(Sports news in telugu): యువ షూటర్ మనుబాకర్ ద్వారా మరో మెడల్ వచ్చేలా ఉంది. ఇది సాధిస్తే ఒలింపిక్స్ లో మనుబాకర్ సంచలనం సృష్టించేలా ఉంది. 10 మీ ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో మను బాకర్, సరభ్ జోత్ జంట కాంస్య పోరుకు చేరువైంది. నేడు ఒంటి గంటకు పోటీ ప్రారంభం కానుంది.


భారత్ నుంచి షూటింగులో 21 మంది క్రీడాకారులు పాలొంటున్నారు. అయితే జరిగిన మూడు రోజుల పోటీల్లో చాలామంది క్రీడాకారులు నిరాశపరిచారు. రైఫిల్ షూటర్ అర్జున్ బబుతా తృటిలో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. రమితా జిందాల్ అయితే పోటీయే ఇవ్వలేకపోయిందనే విమర్శలు వచ్చాయి.
ఇదే ఈవెంట్‌లో.. మరో భారత జంట రిథమ్‌ సంగ్వాన్‌-అర్జున్‌ సింగ్‌ చీమా 576 పాయింట్లతో పదో స్థానంలో నిలిచి పతక రౌండ్‌కు అర్హత సాధించలేక పోయింది.

మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కూడా శుభారంభం చేసింది. హ్యాట్రిక్ మెడల్స్‌పై గురిపెట్టిన సింధు తన క్యాంపైన్‌ను ఘనంగా ప్రారంభించింది. బుధవారం జరగనున్న రెండో రౌండ్‌లో పీవీ సింధు ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో తలపడనుంది.


Also Read: నేడే ఆఖరి టీ 20.. భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా?

భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 21-18, 21-12తో జర్మనీ ఆటగాడు ఫాబియన్ రోట్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ప్రణయ్‌కు తెలుగులో పలు సూచనలు చేశాడు. ఇవిప్పుడు వైరల్ అవుతున్నాయి. పైకి వచ్చిందా? గట్టిగా కిందకు కొట్టు..అంటూ బయట నుంచి డైరక్ట్ చేయడం మైక్ లో రికార్డయ్యింది. ఒలింపిక్స్ లో తెలుగు మాటలు వినడం మనసుకెంతో ఆనందంగా ఉందని తెలుగు నెటిజన్లు సంబరపడుతున్నారు.

ఇక బ్యాడ్మింటన్ డబుల్స్ లో సాత్విక్ జోడీ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ను ఖరారుచేసుకుంది. పురుషుల ఆర్చరీ టీమ్ కూడా క్వార్టర్స్ లో ఓడిపోయింది. అన్నీ భారత్ ఓటమి వార్తలే తప్ప.. విజయం సాధించిన వార్తలు వినిపించడం లేదు. మిగిలిన 12 రోజుల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? అని భారత ప్రజలు ఎదురుచూస్తున్నారు.

 

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×