BigTV English

Ajay Sastry: టాలీవుడ్ డైరెక్టర్ మృతి.. మంచు మనోజ్ ఎమోషనల్

Ajay Sastry: టాలీవుడ్ డైరెక్టర్ మృతి.. మంచు మనోజ్ ఎమోషనల్

Manchu manoj on Ajay Sastry death(Latest news in tollywood): టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ శాస్త్రి మరణించారు. ఈ విషయాన్నీ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు. అజయ్ శాస్త్రి.. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.


డేంజర్, రాఖీ సినిమాలకు రైటర్ గా పనిచేసిన అజయ్.. మంచు మనోజ్ తో నేను మీకు తెలుసా అనే సినిమా తెరకెక్కించి దర్శకుడుగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. అయినా మంచు మనోజ్ కెరీర్ లో నేను మీకు తెలుసా ఒక స్పెషల్ సినిమాగా మిగిలింది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.

ఇక ఈ సినిమా తరువాత అజయ్ ఎక్కడా కనిపించలేదు. అవకాశాలు రాలేదో.. లేక ఇండస్ట్రీని వద్దు అనుకున్నాడో తెలియదు. ఇన్నేళ్ల తరువాత ఆయన మరణించిన వార్త మాత్రమే తెలిసింది. ” నా బెస్ట్ ఫ్రెండ్ మరియు నేను మీకు తెలుసా కెప్టెన్ ఇక లేరని తెలియజేయడానికి హృదయ విదారకంగా ఉంది. నేను పడుతున్న బాధను పదాలు వర్ణించలేవు.


ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ధైర్యాన్ని ప్రసాదించాలని శివుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి. నిన్ను కోల్పోతున్నాను రా అజయ్, చాలా త్వరగా వెళ్ళిపోయావు. ఇది ఒక కల అయితే బావుండని కోరుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు లేకుండా ఏది ఒకేలా ఉండదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను బాబాయ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×