BigTV English

Paris Paralympics: పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు 4 పతకాలు.. ఒక బంగారు, ఒక సిల్వర్, రెండు కాంస్యం..

Paris Paralympics: పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు 4 పతకాలు.. ఒక బంగారు, ఒక సిల్వర్, రెండు కాంస్యం..

Paris Paralympics| భారత ఆటగాళ్లు పారిస్ పారాలింపిక్స్ 2024లో రెండో రోజు ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. శుక్రవారం, ఆగస్టు 30న జరిగిన పోటీల్లో డిఫెండింగ్ షూటింగ్ ఛాంపియన్ అవని లేఖరా ఈ సారి కూడా గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు ప్రీతి పవార్ పారాలింపిక్స్ అథ్లెటిక్ రన్నింగ్ పోటీల్లో భారత్ తొలి పతకం సాధించింది.


మహిళ 10m రైఫిల్ షూటింగ్ పోటీల్లో మోనా అగర్వాల్, అవనీ లేఖరా ఇద్దరూ పతకాలు సాధించారు. పారాలింపిక్స్ లో ఒకవైపు 249.8 పాయింట్ల అత్యధిక స్కోర్ తో రికార్డ్ సృష్టించి మూడోసారి భారత్ కు మెడల్ సాధిస్తే.. మరోవైపు మోనా అగర్వాల్ 228.7 స్కోర్ తో కాంస్య పతకం సాధించింది.

పారాలింపిక్స్ పోటీల్లో వరుసగా రెండు సార్లు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయురాలుగా అవనీ లేఖరా చరిత్ర సృష్టించి.. అలాగే పారాలింపిక్స్ అత్యధిక మెడల్స్ సాధించిన లెజండరీ అథ్లెట్ దేవేంద్ర ఝాజరియా రికార్డు ని ఆమె సమం చేసింది.


పారాలింపిక్స్ లో శుక్రవారం కాంస్య పతకం సాధించిన వనితల్లో ప్రీతి పాల్ కూడా ఉంది. ఆమె పారాలింపిక్స్ 100m T35 మహిళల పరుగుల పోటీల్లో 14.21 సెకండ్స్ లో పూర్తి చేసి మూడో స్థానం సాధించింది. దీంతో ఆమెకు కాంస్య పతకం లభించింది.

ఇక పరుషుల షూటింగ్ పోటీల్లో మనీష్ నర్వాల్ సిల్వర్ మెడల్ సాధించాడు. 2020 టోక్యో పారాలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన మనీష్ ఈ సారి 10m ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో 237.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో అతనికి బంగారు పతకం మిస్ అయింది. పారాలింపిక్స్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ మెడల్స్ సాధించిన అథ్లెట్స్ లో మనీష్ ఆరో స్థానంలో ఉన్నాడు.

పారిస్ పారాలింపిక్స్ 2024లో 2వ రోజు (ఆగస్టు 30) భారతదేశం సాధించిన పతకాలు

అవని ​​లేఖరా (షూటింగ్) – మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణం
మనీష్ నర్వాల్ (షూటింగ్) – పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజతం
మోనా అగర్వాల్ (షూటింగ్) – మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో కాంస్యం
ప్రీతి పాల్ (అథ్లెటిక్స్) – మహిళల 100 మీటర్ల పరుగుల పోటీల్లో కాంస్యం

పారిస్ పారాలింపిక్స్ 2024 పతకాల జాబితాలో భారతదేశం 13వ స్థానంలో ఉంది. చైనా, బ్రిటన్ దేశాలు పతకాల జాబితాలో చెరో 14 మెడల్స్ తో మొదటి రెండు స్థానల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా మూడు బంగారు పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×