BigTV English

Indian Origin Man Shoots: హ్యూస్టన్‌.. నేపాల్ యువతి దోపిడి.. కాల్చి చంపిన ఎన్ఆర్ఐ

Indian Origin Man Shoots: హ్యూస్టన్‌.. నేపాల్ యువతి దోపిడి.. కాల్చి చంపిన ఎన్ఆర్ఐ

Indian Origin Man Shoots: అమెరికాలో దారుణం చేసుకుంది. దోపిడీకి వచ్చిన యువతిని కాల్చి చంపాడు ఎన్నారై. యువతి స్పాట్‌లో మృతి చెందగా, ఎన్నారైని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అసలేం జరిగింది. ఇంకా లోతుల్లోకి వెళ్తే…


అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉంటున్నాడు ఓ ఎన్నారై. ఆయన వయస్సు 52 ఏళ్లు, పేరు బాబీ సిన్ షా. హ్యూస్టన్‌లోని రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాడు. హతురాలు నేపాల్‌కు చెందిన యువతి, పేరు మునుపాండే. వయస్సు 21 ఏళ్లు. నర్సింగ్ స్టూడెంట్ అయిన మును పాండే.. హ్యూస్టన్‌లోని కమ్యూనిటీ కాలేజీలో చదువుతోంది.

గురువారం సాయంత్రం ఐదుగంటలకు హ్యూస్టన్‌లోని ఓ అపార్ట్‌మెంటుకి దోపిడీకి నేపాల్ యువతి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఏం జరిగిందో తెలీదుగానీ.. పెద్దగా కాల్పుల శబ్దం వినిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వచ్చేసరికి తుపాకీ గాయలతో కనిపించింది. రక్త మడుగులో పడి ఉన్న ఆమెను పాండేగా గుర్తించారు. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందింది.


ALSO READ: అమెరికన్లపై నిషేధం విధించిన రష్యా..ఎందుకో తెలుసా?

కాల్పుల ఘటనలో నిందితుడు ఎవరు అన్నది పోలీసులకు మిస్టరీగా మారింది. దర్యాపు కోసం రంగంలోకి దిగిన పోలీసులు తొలుత అపార్ట్‌మెంటు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. బాబీ సిన్ ప్లాట్‌కి పాండే వచ్చినట్టు గుర్తించారు. ఘటన తర్వాత బాబీ తన అపార్టుమెంట్ నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది.

ఆ తర్వాత బాబీ కదలికలపై కన్నేశారు. మరుసటి రోజు అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టు బెయిల్ తోసిపుచ్చింది. విచారణను మంగళవారం నాటికి వాయిదా వేసింది.

మునుపాండేతో మాట్లాడేందుకు ఆమె తల్లి చాలాసార్లు ప్రయత్నం చేసింది. అయినా తల్లికి అందుబాటులోకి రాలేదని హ్యూస్టన్‌లోని నేపాల్ అసోసియేషన్‌కు చెందిన సభ్యుడు తెలిపారు. మునుపాండే అంత్యక్రియల కోసం తల్లిని రప్పించేందుకు ఆన్‌లైన్ ద్వారా ఫండ్ రైజింగ్ చేస్తున్నారు నేపాలీయులు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×