BigTV English

SL Vs AFG: నిస్సంక డబుల్ సెంచరీ.. ఆఫ్గనిస్తాన్‌‌పై లంక ఘనవిజయం

SL Vs AFG: నిస్సంక డబుల్ సెంచరీ.. ఆఫ్గనిస్తాన్‌‌పై లంక ఘనవిజయం
Pathum Nissanka double Century in SL vs AFG

Srilanka Vs Afghanistan Match(Latest sports news telugu): శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక సంచలనం సృష్టించాడు. డబుల్ సెంచరీ సాధించిన తొలి లంక బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా డబుల్ సెంచరీ చేసిన పదవ ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. మొత్తం మీద 139 బంతులు ఆడిన నిస్సంక 20 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 210 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పల్లకెలె వేదికగా జరుగిన తొలి వన్డేలో లంక 42 పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో లంక జట్టు ఆధిక్యంలో ఉంది.


తొలుత టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇదే ఆఫ్గన్ పాలిట శాపంగా మారింది. బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్లు ఆఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. టీ20 తరహాలో ఆడి ఫోర్లు, సిక్సర్లతో ఆఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించిన తర్వాత లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(88, 88 బంతుల్లో 8X4, 3×6) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కుశాల్ మెండిస్ 16, సమరవిక్రమ 45, అసలంక 7* పరుగులతో లంక భారీ స్కోర్ చేసేందుకు తోడ్పడ్డారు. 50 ఓవర్లలో లంక 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. 32వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసిన నిస్సంక 48.5 ఓవర్ల వద్ద 136 ద్విశతకాన్ని అందుకున్నాడు.

Read More: టీమిండియాకు గాయాల బెడద.. మూడో టెస్టుకు అయ్యర్ దూరం?


382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. శ్రీలంక బౌలర్ ప్రమోద్ మధుషాన్ 4 వికెట్లతో ఆఫ్గాన్ నడ్డి విడిచాడు. ఒక దశలో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ఒమర్‌జాయ్ (149*, 115 బంతుల్లో 13×4, 6×6), మహమ్మద్ నబీ (136, 130 బంతుల్లో 15×4, 3×6) సెంచరీలతో కదం తొక్కారు. 50 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. విజయానికి 42 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ద్విశతకంతో అదరగొట్టిన లంక ఓపెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. కాగా రెండో వన్డే ఫిబ్రవరి 11న జరగనుంది.

Related News

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Watch Video : ఈ బుడ్డోడు మాములోడు కాదు… బౌలింగ్ వేస్తూ మూతి పగలగొట్టాడు.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×