Nagpur News: ఇటీవల చిన్న పార్టీ నుంచి మొదలుకుని పెళ్లిళ్ల వరకు డీజే లేకుండా అస్సలు జరగడం లేదు. ఏ ఫంక్షన్ అయినా సరే బ్యాండ్ బాజాలు మోగాల్సిందే. పాట లేనిదే ఏ ఫంక్షన్ కూడా జరగడం లేదు. అంతేకాదు డీజే ఉంటే తప్పా అసలు ఫంక్షన్ కే రావడం కుదరదని చెప్పే బంధువులు కూడా ఉంటున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వారి వరకు చిందులేసేందుకు సై అంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే డీజే వల్ల చాలా సార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.
డీజే కారణంగా చాలా గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ఘటనలు చాలా సహజమే కానీ డీజే కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. డీజే నుంచి వైబ్రేషన్స్ కారణంగా ఒక గోడ కూలి పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని నాగ్ పూర్ లో వెలుగుచూసింది.
ఓ ఇంటి వద్ద డీజేను ప్లే చేశారు. ఈ తరుణంలో ఆ ఇంటికి ఆనుకుని ఉండే ఒక్కసారిగా డీజే నుంచి వచ్చిన వైబ్రేషన్స్ కారణంగా కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న పలువురు స్థానికులు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారికి తీవ్ర రక్త స్రావం కూడా జరిగింది. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే డీజే కారణంగా జరిగిన ఈ ప్రమాదానికి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డీజేను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీజే కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని అంటున్నారు.