Preity Zinta : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి ఐపీఎల్ లో ప్రస్తుత పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న జట్టు టైటిల్ సాధించడం.. లేదా ఫైనల్ కి వెళ్లడం జరుగుతుంటుంది. అతని కెప్టెన్సీ కి లక్ కలిసొస్తుందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ పంజాబ్ ప్లే ఆప్స్ కి చేరుకోలేదు. 2014లో సెహ్వాగ్ పంజాబ్ కి ఆడిన సమయంలో ఫైనల్ కి వెళ్లి.. ఫైనల్ లో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. ఈ సారి శ్రేయస్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సారి ప్లే ఆప్స్ కి కూడా చేరుకుంది. ఇక ఫైనల్స్ కి వెళ్లడం.. టైటిల్ సాధించడమే తరువాయి భాగం. దాదాపు 11 ఏళ్ల తరువాత ఐపీఎల్ టోర్నమెంట్ లో ప్లే ఆప్స్ కి వెల్లింది పంజాబ్ కింగ్స్. దీనంతటికి కొత్తగా వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయాస్ అయ్యరే కారణం. గత ఏడాది శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్ కూడా సాధించింది.
Also Read : Bangalesh Fan : బంగ్లాదేశ్ కు వరల్డ్ కప్ వచ్చే వరకు పెళ్లి చేసుకోను… ఫ్యాన్స్ సంచలనం
వైభవ్ సూర్యవంశీకి ప్రీతి జింటా హగ్గులు..
ఇక ఈ విషయాన్ని గుర్తుంచుకున్న పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ ప్రీతి జింటా శ్రేయస్ అయ్యర్ ని నిత్యం పొగుడుతూనే ఉంటుంది. బాగా ఆడిన సమయంలో శ్రేయస్ కి హగ్ లు కూడా ఇస్తోంది. ఇటీవల పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణించి విజయం సాధించింది. దీంతో ప్లే ఆప్స్ కి కూడా చేరుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా తన ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి ప్రీతి జింటా హగ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని కాదని.. ప్రత్యర్థి జట్టు 14 ఏళ్ల కుర్రాడికి ప్రీతిజింటా హగ్ ఇచ్చిందని శ్రేయస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
అతనికి హగ్ ఇవ్వలేదు : ప్రీతి జింటా
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తాను హగ్ ఇవ్వలేదని పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ ప్రీతి జింటా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటో మార్ఫింగ్ అని ఆమె వెల్లడించారు. ఈ ఫొటోను చూసి తాను కూడా షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. అయితే 14 ఏళ్ల చిన్నారి వైభవ్ కి ప్రీతి జింటా హగ్ ఇవ్వడం ఏంటని.. మార్ఫింగ్ ఫోటోతో కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాశాయి. ఇది వాస్తవం అని ఎవ్వరూ నమ్మవద్దని కోరారు ప్రీతి జింటా. ఇక హగ్ వార్త పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వ్యూస్ కోసం ఇలా చేశారని కొందరూ.. కావాలనే చేశారని మరికొందరూ ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.