Rana Naidu Season 2: దగ్గుపాటి హీరోలు వెంకటేష్, రానా, కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. 2023 లో వచ్చిన సీజన్ 1 కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సీజన్ 2 అంతకుమించి అనేలా రూపొందించారు.రానా నాయుడు గా రానా దగ్గుపాటి,నాగ నాయుడుగా వెంకటేష్ నటించారు.రెండో సీజన్ ముహూర్తం ఫిక్స్ అయింది. తాజాగా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడించారు. ఆ వివరాలు చూద్దాం..
రానా నాయుడు 2 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..
రానా నాయుడు మొదటి సీజన్ నెట్ ఫ్లిక్స్ లో రెండేళ్ల కిందట వచ్చి సంచలనం సృష్టించింది. ఇద్దరు బడా హీరోలు, అందులోనూ అబ్బాయి, బాబాయ్ ఇద్దరు నటించడం, వెబ్ సిరీస్ పై అప్పట్లో క్రేజ్ నెలకొంది. సిరిస్ సక్సెస్ అవ్వడం తో పాటు కొంత విమర్శలు కూడా వచ్చాయి. శృతి మించిన శృంగార సన్నివేశాలు, బూతు కంటెంట్ ఎక్కువగా ఉందని అభిప్రాయము వ్యక్తం అయింది.ఇక తొలి సీజన్ కు కొనసాగింపుగా సీజన్ 2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే, తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూన్ 13 నుండి కొత్త సీజన్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో రానుంది. కరణ్ అన్షుమల్ డైరెక్షన్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కుటుంబం విషయానికి వస్తే రానా నాయుడు అన్ని హద్దులు దాటేస్తాడు అనే క్యాప్షన్ తో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది పండుగ లాంటి వార్తని చెప్పొచ్చు.
సీజన్ వన్ లో..
సీజన్ వన్ లో తండ్రిని ద్వేషించే ఓ పుత్రుడు, అతనికి గుగుణపాఠం చెప్పాలని ప్రయత్నించే తండ్రి. ఈ రెండు క్యారెక్టర్స్ చుట్టూనే సీజన్ వన్ మొత్తం సాగుతుంది. ఈ రెండుపాత్రల చుట్టూ కథని ముడి పెడుతూ కొత్త, కొత్త క్యారెక్టర్స్ ని వీరితో కలుపుతూ మొత్తం పది ఎపిసోడ్లను సీజన్ వన్ లో దర్శకుడు తెరకెక్కించారు. ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా వెంకటేష్ పాత్ర ఉండడం, నెగిటివ్ సైడ్ లో రానా క్యారెక్టర్ సాగడం, సీజన్ వన్ కు హైలెట్ గా నిలిచాయి. ఈ వెబ్ సిరీస్ లో రానా,వెంకటేష్, కృతి ఖర్బంద,అర్జున్ రాంపాల్, సుర్విన్ చావ్లా, సుశాంత్ సింగ్ అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు.
సీజన్ 2 హైలెట్స్ ..
ఈ వెబ్ సిరీస్ లో అర్జున్ రాంపాల్ యొక్క కొత్త గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ సీజన్ కి ఓ హైలెట్ గా నిలవనుంది. సీజన్ 2 లో రానా నాయుడు తన కుటుంబాన్ని రక్షించడానికి చివరికి ఫ్లిక్సింగ్ జాబ్ ను చేపడతాడు కానీ, అర్జున్ రాంపాల్ యొక్క గ్యాంగ్ స్టార్ పాత్రతో కొత్త సమస్యలను ఎదురవుతాయి. యాక్షన్స్ , హై వోల్టేజ్ డ్రామా, ఊహించని ట్విస్టులు సిరీస్ ను మరింత ఉత్కంఠ భరితం చేస్తాయి.ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల లో అందుబాటులో ఉంది.జూన్ 13న బాబాయ్, అబ్బాయి ఇద్దరు రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.