Bangalesh Fan : సాధారణంగా క్రికెట్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ ఈ మధ్య క్రికెటర్లు కూడా కొందరూ ఆసక్తికరమైన, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరూ క్రికెటర్లు మాకు కప్ వచ్చే వరకు నేను ఆ పని చేయనని.. మరికొందరూ మద్యం బంద్ చేయడం ఇలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇండియాతో టెస్ట్ సిరీస్ ముగేసేంత వరకు మద్యం మానేస్తానని నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన ఓ క్రికెట్ అభిమాని బంగ్లాదేశ్ కి ప్రపంచ కప్ వచ్చేంత వరకు తాను పెళ్లి చేసుకోను అని శపథం చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.
Also Read : Digvesh rathi: దూల తీరింది…దిగ్వేశ్ పై నిషేధం.. జుట్టు కత్తిరించిన BCCI
ముఖ్యంగా ఇలాంటివి ఫన్నీ కామెంట్స్ అని కొందరూ పేర్కొంటున్నారు. ముఖ్యంగా యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ బంగ్లాదేశ్ ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఈ సందర్భంగా షార్జా క్రికెట్ స్టేడియంలో ఫన్నీ ప్లకార్డులో “బంగ్లాదేశ్ ప్రపంచకప్ గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను” అని ప్లకార్డు రాసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెంటర్లు బంగ్లాదేశ్ అభిమానికి రాబోయే రెండు ICC వైట్-బాల్ గురించి సరదాగా గుర్తు చేశారు. 2026 టీ-20 వరల్డ్ కప్, 2027 వన్డే వరల్డ్ కప్ లు ఉన్నాయని.. తెలిపారు. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియానే ప్రపంచంగా భావిస్తున్నారు. నేరుగా ఓ వినియోగదారుడి ఖాతా నుంచి ఇలాంటి వార్త వచ్చింది. అయితే అది మాత్రం వాస్తవమో కాదో.. మాత్రం తెలియదు.
Also Read : Rohit Sharma: 4 కోట్ల కారును గిఫ్ట్ గా ఇచ్చిన రోహిత్ శర్మ
బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతోంది. కానీ భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లతో తలపడాలంటే బంగ్లాదేశ్ కి పెద్ద సవాల్ అనే చెప్పాలి. అయితే బంగ్లా ఆటగాళ్లు అన్ని రంగాల్లో రాణించి.. అద్భుతమైన ఫామ్ లో కొనసాగితే కచ్చితంగా 2026 టీ-20 వరల్డ్ కప్ అయినా.. 2027 వన్డే వరల్డ్ కప్ అయినా సాధించవచ్చు. కానీ ప్రస్తుతం ఆ జట్టు కేవలం పాకిస్తాన్, అప్గానిస్తాన్, శ్రీలంక వంటి జట్లను మాత్రమే ఓడిస్తుంది. మిగతా జట్లతో తలపడినప్పటికీ గట్టి పోటీని ఇస్తుంది. కానీ విజయం మాత్రం సాధించలేకపోతోంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి. వీటిని ఓడించిన జట్లే ఏ ప్రపంచ కప్ లోనైనా విజయం సాధిస్తున్నాయి. వెస్టిండీస్ జట్టు ఒకప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉంటే.. ఇప్పుడు ఆ జట్టు కూడా ఫామ్ కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ అభిమాని చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
?igsh=MWhzYTNiYzV5MGMwaw==