BigTV English

Metro connectivity: మెట్రో సరికొత్త ప్లాన్- ఇక అక్కడికీ రవాణా సేవలను విస్తరించే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి

Metro connectivity: మెట్రో సరికొత్త ప్లాన్- ఇక అక్కడికీ రవాణా సేవలను విస్తరించే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి

Metro connectivity: సీఎం రేవంత్‌రెడ్డి నాలుగో సిటీపై దృష్టి సారించారు. మరో కీలక నిర్ణయం తీసు కోవాలని భావిస్తున్నారు. పెట్టబడులు మాత్రమేకాదు ట్రాన్స్‌పోర్టు సదుపాయాలు కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతమున్న మెట్రోను ముచ్చర్ల వరకు పొడిగించాలనే ఆలోచన చేస్తున్నారట. దీనిపై సాధ్యా సాధ్యాలు ఎలా ఉంటాయన్న దానిపై అధ్యయనం మొదలైనట్టు సమాచారం.


హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌పై ఫోకస్ చేసింది రేవంత్ సర్కార్. శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించా లని నిర్ణయించింది. దానికి సంబంధించిన తెర వెనుక పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని ముచ్చర్ల వరకు పొడిగించాలని భావిస్తున్నారు. విస్తరణ జరిగితే ఫీజుబులిటి, అలైన్‌మెంట్, రూట్, భూసేకరణ ఇలా ప్రతీ అంశంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటేల్స్ రెడీ చేసిన తర్వాత రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వనుంది.

ముచ్చర్ల వరకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తే, ఇప్పటివరకు అనుకున్న విస్తరణ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే దాదాపు 79 కిలోమీటర్లు పెంచాలని అనుకున్నారు. అది ముచ్చర్లకు చేరితే అంచనా వ్యయంతోపాటు కిలోమీటర్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఖర్చు కూడా అమాంతంగా పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.


ALSO READ: బీఆర్ఎస్ లో ఆగిన వలసలు..దేనికి సంకేతం?

శంషాబాద్ నుంచి ముచ్చర్లకు మెట్రో రూటు వేయాలంటే దాదాపు 35 కిలోమీటర్లు అదనంగా ట్రాక్ వేయా ల్సి ఉంటుందన్నది ఓ ఆలోచన. కేవలం శంషాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి లింక్ చేస్తే మార్గాన్ని వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముచ్చర్లను ఫ్యూచర్ సిటీగా చెబుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటి వరకు దాదాపు 20 వేల ఎకరాలను సేకరించినట్టు తెలుస్తోంది. వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది.

అమెరికా, కొరియాలకు వెళ్లిన రేవంత్ టీమ్, ముచ్చెర్ల సిటీ ప్లాన్ బయటపెట్టింది. ఏఐ సిటీగా దీన్ని రూపొం దిస్తున్నట్లు వెల్లడించింది. ఐటీ, స్పోర్ట్స్, మెడికల్, ఎడ్యుకేషన్, టూరిజం, వినోదం వంటి రంగాలు అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చింది. ఇన్ని రంగాలు ఏర్పాటు చేస్తే, ట్రాన్స్‌పోర్టుకు ఎలాంటి  సమస్య లేకుండా చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పట్టణాభివృద్ధి, ట్రాన్స్‌ పోర్టు, రైల్వే మంత్రులతో చర్చించనున్నారు. మొత్తానికి ఫ్యూచర్ సిటీ పక్కాగా ప్లాన్ చేశారు సీఎం రేవంత్‌‌రెడ్డి.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×