IPL on Indian Army : ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 28 మంది భారతీయులు మరణించారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు ప్రతికారంగా ఇవాళ అర్థరాత్రి 1 గంటల సమయంలో పాకిస్తాన్ లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైనికులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే దాడికి ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేశారు. వాస్తవానికి పెళ్లి జరిగి కేవలం 6 రోజులు అయిన దంపతులు పెహల్గామ్ వెళ్లడంతో అక్కడ వరుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో దానికి ప్రతీకారంగా సిందూర్ ఆపరేషన్ లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read : MI vs PBKS: ఉగ్రవాదుల టెన్షన్…ముంబైలో మ్యాచ్ లు… షాక్ లో పంజాబ్ !
అయితే తాజాగా ఇండియ్ ఆర్మీకి గౌరవం ఇచ్చారు. కోల్ కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ స్కోర్ బోర్డులో స్టేడియం పై స్క్రీన్ లో Proud of the Indian armed forces. అని రాసి ఉండటం విశేషం. అయితే భారత ఆర్మీ పాకిస్తాన్ లో ఉగ్రవాదుల స్థావరాల పై దాడి చేసినందుకు ప్రౌండ్ గా పీలయ్యారు. కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో ఈ బోర్డు ఏర్పాటు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత కోల్ కతా నైట్ రైౌడర్స్ బ్యాటింగ్ చేసింది. ఈ జట్టు 20 ఓవర్లకు 179 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ 16 ఓవర్లలో 147 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించే దిశలో కనిపిస్తోంది.
Also Read : Influencer Sona Dey: ఫ్లైయింగ్ కిస్సులు… ఇద్దరు లవర్స్ ను విడగొట్టిన హార్దిక్ పాండ్యా
వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచినప్పటికీ ఇవాళ్టి మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్బాజ్ 11, నరైన్ 26, అజింక్యా రహానె 48, మనీశ్ పాండే 36, రస్సెల్ 38 కీలక ఇన్నింగ్స్ ఆడటంతో 20 ఓవర్లకు 179 పరుగులు చేశారు. ఇక 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇవాళ అద్భుతంగా ఆడుతోంది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కావడం గమనార్హం. ఉర్వి పటేల్ 31, బ్రేవిస్ 52, శివమ్ దూబే 45, రవీంద్ర జడేజా 19 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా కొనసాగింది. చివరి 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతికే కెప్టెన్ ధోనీ 6 బాదాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు సునాయసం అయింది. ఆ తరువాత బంతి డాట్ కావడంతో ఉత్కంఠగా మారింది. మూడో బంతికి 1 సింగిల్ తీశాడు ధోనీ. దీంతో డ్రా అయింది. 3 బంతుల్లో 1 పరుగు చేయాల్సి ఉంది. కంబోజ్ క్రీజులో ఉన్నాడు. కంబోజ్ 4 బాదాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Screen in today match #IPL2025 #OperationSindoor #ArmedForces #IndianAirForce #IndianArmy pic.twitter.com/e7LdATYP5O
— विरक्त पहाड़ी (@ViraktPahadi) May 7, 2025