MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
నేపథ్యంలో.. మ్యాచ్ ల వేదికలు మారబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. అర్ధరాత్రి ఒకటి గంటల తర్వాత పాకిస్తాన్ ఉగ్ర మూలాలపై విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. మొత్తం తొమ్మిది స్థానాలలో ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించి మరి దాడులు చేసింది. దీంతో ఇప్పటివరకు వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం అందుతుంది.
Also Read: IPL 2025 – Operation Sindoor: పాకిస్థాన్ పై యుద్ధం.. IPL 2025 రద్దు.. బీసీసీఐ ప్రకటన ఇదే ?
ఐపీఎల్ 2025 పై ఉగ్రవాదుల ఎఫెక్ట్?
పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor ) పేరుతో ఇండియన్ ఆర్మీ ( Indian Army) చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో… అటువైపు నుంచి కూడా వార్నింగులు వస్తున్నాయి. ఇవాళ ఇండియా దాడి చేసింది.. మేము ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి… టైం చూసి దెబ్బ తీస్తాం అంటూ పాకిస్తాన్ నుంచి వరుసగా వార్నింగ్ లు వస్తున్నాయి. ఆర్మీ అధికారులు అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ఇప్పటికే ఇండియాకు వార్నింగులు పంపారు. అటు జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ముగ్గురు సామాన్యులను కూడా చంపేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుందా లేదా అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఐపిఎల్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుందని… ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పింది.
పంజాబ్ లో మ్యాచ్ లు రద్దు… ముంబై కి తరలింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాకిస్తాన్ ఉగ్రవాదులు… రెచ్చిపోయే ప్రమాదం ఉందని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే పాకిస్తాన్ కు దగ్గరగా ఉన్న పంజాబ్ వేదికగా ఎలాంటి ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారట. దీంతో పంజాబ్ లో జరిగే ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వకుండా నిర్ణయం తీసుకుందట బిసిసిఐ. ఇందులో భాగంగానే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Punjab Kings vs Mumbai Indians ) మధ్య 61వ మ్యాచ్ మే 11వ తేదీన ఆదివారం రోజున జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ధర్మశాలలో కొనసాగుతుంది. అయితే ధర్మశాల లో కొనసాగితే ఉగ్రవాదులు అటాక్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ధర్మశాల నుంచి ఆ మ్యాచ్ ను ముంబైకి తరలించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇకపై పంజాబ్లో ఎలాంటి మ్యాచ్ నిర్వహించకూడదని కూడా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓ నిర్ణయానికి వచ్చింది.
Also Read: Select Gandhi Ji with Kohli : RCB 18 ఏళ్ల కల నెరవేర్చిన గాంధీజీ.. సంబరాల్లో విరాట్ కోహ్లీ!
🚨 UPDATE ON IPL 2025 🚨
– Mumbai Indians vs Punjab Kings match likely to be shifted to Mumbai from Dharamshala. (Sports Tak). pic.twitter.com/b0deZjF354
— Tanuj (@ImTanujSingh) May 7, 2025