Ashutosh Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
నేపథ్యంలో అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే టోర్నమెంట్ దాదాపు సగానికి పైగా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మ
ను ( Ashutosh Sharma )… ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేశారు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్.
Also Read: IPL 2025 – Operation Sindoor: పాకిస్థాన్ పై యుద్ధం.. IPL 2025 రద్దు.. బీసీసీఐ ప్రకటన ఇదే ?
అశుతోష్ శర్మ తో ర్యాగింగ్ చేసిన హైదరాబాద్ ఫ్యాన్స్
మే 5 సోమవారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. ఈ దెబ్బకు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు అందరూ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా అప్పటికే స్టేడియానికి వచ్చిన అభిమానులు సందడి చేశారు.
ఇక.. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మను ఒక ఆట ఆడుకున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. దూరం నుంచి పిలుస్తూ… ఒరేయ్ అశుతోష్ శర్మ మా వైపు చూడు… మా వైపు చూడకపోతే నువ్వు డక్ అవుట్ అవుతావు… మా వైపు చూడు… చెయ్యి లేపు… అంటూ ఊర మాస్లో ర్యాగింగ్ చేశారు. ఇక వాళ్ళ బాధ భరించలేక… చెయ్యి పైకి లేపి హైదరాబాద్ అభిమానులకు హాయ్ చెప్పాడు అశుతోష్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో పోకిరి సినిమాలోని… బిచ్చగాడు పాత్ర చేసిన అలీ వీడియోను వైరల్ చేస్తున్నారు. బిచ్చం కోసం… బ్రహ్మానందాన్ని ఒక ఆట ఆడుకుంటాడు అలీ. ఇక్కడ కూడా అలాగే జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025 నుంచి ఎలిమినేట్ అయిన హైదరాబాద్
వర్షం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చెరొక పాయింట్ లభించింది. ఒకవేళ వర్షం పడకపోయి ఉంటే హైదరాబాద్ కచ్చితంగా గెలిచేది. కానీ హైదరాబాద్ ను దురదృష్టం వెంటాడింది. ఈ నేపథ్యంలోనే ప్లే ఆఫ్ కు వెళ్లకుండానే వైదొలిగింది హైదరాబాద్. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Select Gandhi Ji with Kohli : RCB 18 ఏళ్ల కల నెరవేర్చిన గాంధీజీ.. సంబరాల్లో విరాట్ కోహ్లీ!
?igsh=NXh0cTU4dnY3dDZu