BigTV English

Qatar Warns Fans : ఖతార్‌లో అందాల విందుకు కత్తెర

Qatar Warns Fans : ఖతార్‌లో అందాల విందుకు కత్తెర

Qatar Warns Fans : ఫిఫా వరల్డ్ కప్ మరో రెండు రోజుల్లో ఖతార్‌లో ప్రారంభం కాబోతోంది. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు జరిగే సాకర్ పోటీల్ని చూసేందుకు… అన్ని దేశాల నుంచి అభిమానులు ఖతార్‌కు క్యూ కడుతున్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌ జరిగే చోట ప్రతిసారీ మహిళలు, యువతులు తమ అందచందాలతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతార్‌ మాత్రం… ఈసారి అలాంటి సీన్లకు చోటు లేదంటోంది.


సాధారణంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చూడ్డానికి వచ్చే ఫ్యాన్స్ కు… ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదు. ఎవరైనా, ఎలాంటి దుస్తుల్లో అయినా స్టేడియంలో కనిపించవచ్చు. కొన్నిసార్లు యువతులు, మహిళలు బాడీపార్ట్స్‌ కనిపించేలా బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటారు. లిక్కర్‌ కూడా అన్‌లిమిటెడ్‌. ఇలాంటివి మిగతాచోట్ల ఏమోగానీ… ఇస్లాం గట్టిగా ఫాలో అయ్యే అరబ్‌ దేశాల్లో ఇలాంటివి నిషేధం. అయితే ప్రతిష్టాత్మక​ ఫిఫా వరల్డ్‌‍కప్‌కు ఒక మిడిల్‌ ఈస్ట్‌ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండడంతో… ఖతార్‌ కొన్ని నియమాలను సడలించింది. మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకులు తమతో లిక్కర్‌ తెచ్చుకుంటే అనుమతిస్తామని ప్రకటించింది. అయితే బహిరంగంగా ఎక్కడా మద్యం అమ్మరని… అభిమానులు వెంట తెచ్చుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.

అయితే… మ్యాచ్‌కు వచ్చే మహిళలు, యువతులు ధరించే దుస్తులపై మాత్రం కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయంటోంది… ఖతార్. మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే మహిళలు, యువతులు ఎట్టి పరిస్థితుల్లోనే కురచ దుస్తులు వేసుకొని రావొద్దని కోరింది. శరీర భాగాలు కనిపించేలా అసభ్యకరమైన దుస్తులు వేసుకుని వస్తే స్టేడియంలోకి కూడా అనుమతించబోమని… గొడవ చేస్తే జైలుకు పంపేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. అయితే ఫిఫా వెబ్‌సైట్‌లో మాత్రం మ్యాచ్‌ చూడడానికి వచ్చే ఫ్యాన్స్ డ్రెస్‌ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఖతార్ తెలిపింది. తమ దేశ నిబంధనల ప్రకారం శరీర భాగాలు కనిపించకుండా దుస్తులు వేసుకొని వస్తే మంచిదని పేర్కొంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×