E-Paper
Advertisement

NBK 108 Villain: బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ స్టార్‌.. స్కెచ్ అదిరింది!

NBK 108 Villain: బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ స్టార్‌.. స్కెచ్ అదిరింది!
Advertisement

NBK 108 Villain : నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల మీద సినిమాల‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు. ఓ సినిమా పూర్త‌వ‌గానే మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తోన్న 107వ చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా పూర్తి కాక మునుపే బాల‌య్య త‌న 108 సినిమాను అనౌన్స్ చేసేశారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అయిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కింనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు NBK 108 చిత్రంలో ఓ బాల‌వుడ్ స్టార్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ట‌. అత‌నెవ‌రో కాదు.. అర్జున్ రాంపాల్‌. బాల‌య్య‌కు ధీటుగా ఉండే ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో బాలీవుడ్ విల‌న్ అయితే బావుంటుంద‌ని భావించిన అనీల్ రావిపూడి అర్జున్ రాంపాల్‌ను సంప్ర‌దించార‌ట‌. ఆయ‌న కూడా ఓకే చెప్పేశార‌ని టాక్ వినిపిస్తోంది. నిజానికి అర్జున్ రాంపాల్ .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న హ‌రి హ‌ర వీర మ‌ల్లు చిత్రంలో న‌టించాల్సింది. కానీ ఆ సినిమా షూటింగ్ వాయిదాలు ప‌డుతూ వ‌చ్చింది. దీంతో అర్జున్ రాంపాల్‌కి డేట్స్ స‌మ‌స్య వ‌చ్చింది. దీంతో ఆయ‌న ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ని టాక్‌. ఇప్పుడు బాల‌య్య సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×