BigTV English

R Praggnanandhaa : చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి టాప్‌లోకి..

R Praggnanandhaa : యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద దూసుకెళ్తున్నాడు. దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి భారత టాప్‌ ర్యాంకర్‌గా అవతరించాడు. బుధవారం జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించడంతో ఈ ఘనత అందుకున్నాడు.

R Praggnanandhaa :  చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి  టాప్‌లోకి..
R Praggnanandhaa latest news

R Praggnanandhaa latest news(Sports news in telugu):

యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద దూసుకెళ్తున్నాడు. దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి భారత టాప్‌ ర్యాంకర్‌గా అవతరించాడు. బుధవారం జరిగిన టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించడంతో ఈ ఘనత అందుకున్నాడు.


ప్రజ్ఞానంద భారత నంబర్‌ వన్‌ ప్లేయర్‌గా అవతరించడంపై అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రశంసలు కురిపించారు. ఇవి అద్భుతమైన క్షణాలన్నారు. ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి ఈ ఘనత అందుకున్న ప్రజ్ఞానందను చూసి దేశం గర్వపడుతోందని అభినందించారు.

ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇటీవల అదానీ గ్రూప్‌ ప్రకటించింది. గతేడాది చెస్‌ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద కొద్దిలో టైటిల్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినా ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిచ్చి అందరి మనసులు గెల్చుకున్నాడు.


ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచాడు. విశ్వనాథన్‌ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్‌ తరఫున టాప్‌ ప్లేయర్‌గా ఈ యువ గ్రాండ్‌ మాస్టర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత.. క్లాసికల్‌ చెస్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు.

Tags

Related News

Bigg Boss 9 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌ కాదు.. సింగిలే, మూడో వారం కామనర్‌ అవుట్‌!

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Big Stories

×