E-Paper
Advertisement

YS Sunitha : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ..? కాంగ్రెస్ లోకి షర్మిల ఆహ్వానం..!

YS Sunitha : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ..? కాంగ్రెస్ లోకి షర్మిల ఆహ్వానం..!
Advertisement
Political news in AP

YS Sunitha latest news(Political news in AP):

వైఎస్ కుటుంబం నుంచి మరో లీడర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరాలంటూ సునీతను ఆహ్వానించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడప ఎంపీగా పోటీ చేయాలని కూడా కోరారు. వైఎస్ సునీతను ఇప్పటికే తమ పార్టీలో చేరాలని టీడీపీ సైతం ఆహ్వానించింది. ఈ క్రమంలో తన రాజకీయ రంగప్రవేశంపై కుటుంబ సభ్యులతో సునీత మంతనాలు జరుపుతున్నారు.

వైఎస్‌ వివేకా హత్య జరిగే వరకు సునీత పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. వృత్తిపరంగా డాక్టర్. తన పని తాను చేసుకునేవారు. అయితే తన తండ్రి హత్య కేసు దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసి వార్తల్లోకి ఎక్కారామె. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపైనే కోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో సునీతకు షర్మిల సైతం మద్దతుగా నిలిచారు. అప్పుడు సపోర్ట్ చేసిన షర్మిల.. ఇప్పుడు పొలిటికల్‌గాను అండగా నిలుస్తానంటూ ఆఫర్ ఇచ్చారు.

Advertisement

మరి షర్మిల ఆఫర్‌కు సునీత ఓకే చెబుతారా..? కడప నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారా..? మరోవైపు.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జరుపుతున్నట్టు చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ, కాంగ్రెస్ మద్దతు కోరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

Big Stories

Advertisement
×