BigTV English

Rafael Nadal-Carlos Alcaraz: పారిస్ ఒలింపిక్స్ నుంచి దిగ్గజ ఆటగాళ్లు అవుట్.. రాఫెల్, కార్లోస్ జోడికి అమెరికన్ల చేతిలో ఓటమి!

Rafael Nadal-Carlos Alcaraz: పారిస్ ఒలింపిక్స్ నుంచి దిగ్గజ ఆటగాళ్లు అవుట్.. రాఫెల్, కార్లోస్ జోడికి అమెరికన్ల చేతిలో ఓటమి!

Rafael Nadal-Carlos Alcaraz| పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ డబుల్స్ టోర్నమెంట్ లో షాకింగ్ మ్యాచ్ జరిగింది. టెన్నిస్ టాప్ ఆటగాళ్లను అమెరికన్ జోడీ గురువారం సునాయసంగా ఓడించేసింది. పురుషల టెన్నిస్ డబుల్స్ క్యాటగిరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో స్పానిష్ దిగ్గజ జోడీ కార్లోస్ అల్కరాజ్, రాఫెల్ నాదల్ తో అమెరికన్ ఆటగాళ్లు ఆస్టిన్ క్రాజిసెక్, రాజీవ్ రామ్ తలపడ్డారు.


అయితే ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ టెన్నిస్ అభిమానులకు చేదు అనుభవం మిగుల్చింది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. ఒకరు ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ ఆల్కరాజ్, మరొకరు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్లు, 15 ఫ్రెంచ్ టైటిల్లు గెలిచిన లెజెండ్ రాఫెల్ నాదల్. వీరిద్దరూ కలిసి జోడీ కడితే.. ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు నిలవలేరనుకున్నారంతా.. అయితే ఈ అంచనాలు తారుమారయ్యాయి. అమెరికన్ జోడీ ఆస్టిన్, రాజీవ్ రామ్ వీరద్దరినీ కేవలం రెండు స్ట్రైయిల్ సెట్స్ లో మట్టికరిపించారు.

ఒలింపిక్స్ మెన్స్ డబుల్స్ టెన్నిస్ క్వార్టర్ ఫైనల్లో అమెరికన్ జోడీ 6-2, 6-4 నాదల్, ఆల్కరాజ్ స్పానిష్ జోడిని ఓడించింది. మ్యాచ్ అద్యంతం అమెరికన్ ఆటగాళ్ల డామినేషన్ నడిచింది. విచిత్రమేమిటంటే ఫ్రెంచ్ టెన్నిస్ కోర్టుల్లో చెలరేగిపోయే నాదల్ ఈ మ్యాచ్ లో తడిబడిపోవడం. అది కూడా ప్రపంచ ఫేమస్ ఫిలిస్ చాట్రియర్ టెన్నిస్ కోర్టులో నాదల్ గతంలో ఎన్నో సార్లు విజయం సాధించాడు.


ఈ మ్యాచ్ చూసిన వారంతా ఇక రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు మ్యాచ్ తరువాత నాదల్ ముందు ప్రస్తావించినప్పుడు.. ”ఒక ఫ్రొఫెషనల్ గా నాలో ఆట ఆడేందుకు ఆసక్తి లేనప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటిస్తాను.. ప్రస్తుతానికి ఆ సమయం రాలేదు. నేను నా తరువాతి మ్యాచ్ పై ఫోకస్ చేయాల్సి ఉంది.” అని ఆయన సమాధానమిచ్చారు.

Also Read: మెగా వేలం వద్దు.. మినీ వేలం ముద్దు : షారూఖ్ మాటలతో రచ్చ.. మద్దతు తెలిపిన కావ్య

Tags

Related News

Tilak Varma : గిల్ కోసం బలి పశువు అవుతున్న నెంబర్ 2లో తిలక్ వర్మ.. ఏంట్రా ఈ రాజకీయాలు అంటూ గంభీర్ పై ఫైర్

Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Big Stories

×