Inter Academic Calender: తెలంగాణ ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు. ఈ క్రమంలోనే 2024-2025 సంవత్సరానికి గాను విద్యా క్యాలెండర్ ను బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. ఈ క్యాలెండర్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ని కాలేజీలకు వర్తించనుంది. ఇక సెలవుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇంటర్మిడియట్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా పండుగకు 8 రోజులు సెలవులు వచ్చాయి. అక్టోబర్ 6 నుంచి మొదలుకుని 13వ తేదీ వరకు దసరా సెలవులు రానున్నాయి. ఇక నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్టీ పరీక్షలు జరుగుతాయి. ఇక జనవరి నెలలో రానున్న సంక్రాంతికి 11 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. తిరిగి కాలేజీ ప్రారంభం కాగానే జనవరి 20 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్ జరుగుతాయి. మార్చి నెలలో థియరీ పరీక్షలు ఉంటాయని క్యాలెండర్ లో స్పష్టం చేశారు. మార్చి 29వ తేదీలో ఇంటర్ కాలేజీలు మూతపడనున్నాయి. మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.
Also Read: రంజిత్, మహేందర్ ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్.. కాళ్లు పట్టుకున్నా పార్టీలో చేర్చుకోం..
వేసవి సెలవులు..
ఇంటర్ కాలేజీలకు బోర్డు వేసవి సెలవులను ప్రకటించింది. మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు కార్యదర్శి ప్రకటించారు. ఈ మేరకు శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. బోర్డు ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇంటర్ ఫలితాలు..
ఈ ఏడాది ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరగానే వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఈ ఏడాది పేపర్ వాల్యుయేషన్ త్వరగా చేపట్టింది. అతి త్వరలోనే పూర్తి చేసి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే.