BigTV English

RR Lost the match Against GT: ఓడినా నెంబర్ వన్.. రాజస్థాన్ రాయల్స్ చచ్చీ చెడి.. ఒక ప్లేస్ మారిన గిల్ సేన!

RR Lost the match Against GT: ఓడినా నెంబర్ వన్.. రాజస్థాన్ రాయల్స్ చచ్చీ చెడి.. ఒక ప్లేస్ మారిన గిల్ సేన!

Rajasthan Royals Continues in 1st Place even Lost Against Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఆడిన రెండు సిరీస్ ల్లో కూడా ఒక దాంట్లో ట్రోఫీ సాధించింది. మరొక దాంట్లో ఫైనల్ వరకు వెళ్లింది. ఇప్పుడు మూడో సీజన్ లో ఎంతదూరం వెళుతుందోనని నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్ లో ఎట్టకేలకు గెలిచి కొంచెం ఊపిరి తీసుకుంది. రేస్ లో నేనూ ఉన్నానని చెప్పింది. పాయింట్ల టేబుల్ లో 6వ స్థానంలోకి వచ్చింది.


ఇంతవరకు 6 మ్యాచ్ లు ఆడి, మూడింట ఓడి, మూడు గెలిచి 6 పాయింట్లతో ఒక స్టెప్ ముందుకు వెళ్లింది. మ్యాచ్ లో చూస్తే ఈసారి ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. తర్వాత గిల్ అవుట్ అయ్యాక కథయిపోయందని అనుకున్నారు గానీ, చివర్లో రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా సమన్వయంతో ఆడి మ్యాచ్ ని గెలిపించారు.

ఇక్కడే ఇలా చచ్చీచెడి గెలిస్తే, రాబోవు మ్యాచ్ ల్లో మరింత టఫ్ గా ఉంటాయి. అప్పుడెలా ఆడతారనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నుంచి పగ్గాలందుకున్న గిల్, తన వరకు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. మిగిలిన వాళ్లు కూడా తనలా పెర్ ఫార్మ్ చేయగలిగితే జట్టుకి తడబాటు తగ్గుతుందని చెబుతున్నారు.


Also Read: వెంకటేశ్ ప్రసాద్ టీమ్ లో.. ఆ ముగ్గురు లేరు 

ఇక ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే అంటారు. అలాగే రాజస్థాన్ మ్యాచ్ ఓడినా సరే, తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోలేదు. రన్ రేట్ తక్కువగా ఉన్నా పాయింట్ల ప్రకారం ముందు స్థానంలో ఉంది. అయితే తన వెనుకనే మెరుగైన రన్ రేట్ తో కోల్ కతా వెంటపడుతోంది. ఒకవేళ కోల్ కతా తర్వాత మ్యాచ్ లో గెలిస్తే మాత్రం ఆర్ ఆర్ కిందపడటం ఖాయంగా ఉంది.

మొత్తానికి  ఐపీఎల్ మ్యాచ్ లు సీరియస్ గా జరుగుతున్నాయి. పాయింట్లు అటు ఇటు అవుతున్నాయి. గెలిచిన వాళ్లందరూ వరుసగా ఓడాలి. లేదా ఓడిన వాళ్లందరూ వరుసగా గెలవాలి. ఇలా జరిగితే దిగువన ఉన్నవాళ్లు పైకెళతారు. పైన ఉన్నవాళ్లు కిందపడతారు. ఇవన్నీ జరగాలంటే మరికొద్ద రోజులు ఆగాల్సందే.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×