BigTV English
Advertisement

MG Hector Black Storm Launched: లాంచ్‌ అయిన ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు!

MG Hector Black Storm Launched: లాంచ్‌ అయిన ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు!

MG Hector Black Storm Launched: MG మోటార్ ఇండియా భారతదేశంలో కొత్త హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను తాజాగా విడుదల చేసింది. కంపెనీ దీనిని రూ.21.25 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో తీసుకొచ్చింది. గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్, ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ తర్వాత MG మూడవ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఇది. ఈ ప్రత్యేక ఎడిషన్ పూర్తిగా బ్లాక్ కలర్, ఎరుపు రంగు హైలైట్‌లతో అందుబాటులో ఉంటుంది.


ఇంటీరియర్‌లో బ్లాక్ కలర్‌తో గన్‌మెటల్ హైలైట్‌లు కనిపిస్తాయి. అంతేకాకుండా హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ 5, 6, 7 సీట్ల ఎంపికలలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 18-అంగుళాల ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌లైట్ ఉన్నాయి.

అదేవిధంగా ఇంటీరియర్‌ పరంగా చూస్తే.. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, డోర్ హ్యాండిల్స్, ఏసీ వెంట్‌లను కలిగి ఉంది. ఈ ఇంటీరియర్ బ్లాక్, గన్‌మెటల్ థీమ్‌ను కలిగి ఉంది. అదనంగా, ఇది ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద 14-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఇది సాధారణ హెక్టర్‌లో కూడా అందుబాటులో ఉంది.


Also Read: ఫ్యామిలీ కోసం 7 సీటర్​ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ మోడల్స్ ఇవే!

ఆండ్రాయిడ్ ఆటో, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 2 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 141 PS శక్తిని, 250NM టార్క్‌ని అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి గేర్‌బాక్స్‌తో దీనిని కొనుక్కోవచ్చు.

అలాగే ఈ ఎస్యూవీ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది 168 PS, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చింది. లీటర్‌కు 15.58 కి.మీ రేంజ్ అందిస్తుంది.

6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), పార్కింగ్ సెన్సార్‌లు డిస్క్ బ్రేకులు వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది 100 వాయిస్ కమాండ్‌లతో సహా 75 కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడిన ఫీచర్‌లతో వస్తుందని కంపెనీ తెలిపింది.

Tags

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×