Big Stories

Yuzvendra Chahal: ఐపీఎల్ తొలి బౌలర్ గా చాహల్.. 200 వికెట్లు తీసిన తొలి క్రికెటర్ గా రికార్డ్

Yuzvendra Chahal’s Milestones on The Way To 200 IPL Wickets: ఐపీఎల్  ప్రారంభమైన 16 ఏళ్లలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ యజ్వేంద్ర చాహల్ రికార్డ్ సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ 200 వికెట్ల క్లబ్ లో చేరాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ నబీ వికెట్ తీసి ఆ మార్క్ చేరుకున్న తొలి బౌలర్ గా నిలిచాడు.

- Advertisement -

చాహల్  152 మ్యాచ్ ల్లో 200 వికెట్ల ఘనత సాధించాడు. తన తర్వాత డ్వాన్ బ్రావ్ 183 (158 ఇన్నింగ్స్), తర్వాత పీయూష్ చావ్లా 181 (158 ఇన్నింగ్స్) , భువనేశ్వర్ కుమార్ 174 (167 ఇన్నింగ్స్) , అమిత్ మిశ్రా 173 (161 ఇన్నింగ్స్) వికెట్లతో తన వెనుకే వస్తున్నారు.

- Advertisement -

కానీ వీరందరికన్నా చాహల్ గొప్పతనం ఏమిటంటే తను తక్కువ అంటే 152 మ్యాచ్ ల్లోనే 200 వికెట్లు సాధించాడు. అంటే అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రికార్డ్ కూడా చాహల్ ఖాతాలోకే వెళ్లింది.

Also Read: ధోనీ సేన మెరుస్తుందా? నేడు చెన్నయ్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్

ఈ సందర్భంగా చాహల్ మాట్లాడుతూ నేను ముంబయి తరఫున మూడేళ్లు ఆడాను. ఆర్సీబీలో ఎక్కువ కాలం ఆడానని అన్నాడు. నా ఆటలో ఉత్థాన పతనాలు రెండూ ఉన్నాయి. ఆ రెండు పార్శ్వాలు చూశానని అన్నాడు. ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, నా ఆటలో నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలే కారణమని అన్నాడు. అలాగే నా లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ముందుకు నడిపించిన స్నేహితులు కూడా కారణమేనని అన్నాడు.

2011లో ముంబయితో ఒప్పందం చేసుకున్న చాహల్ రెండేళ్ల తర్వాత అంటే 2013లో ఆరంగేట్రం చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ కోల్ కతా తో ఆడాడు. అది కూడా నాలుగు ఓవర్లు వేసి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

తర్వాత తను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అక్కడే తన కెరీర్ మలుపు తిరిగింది. 2014-2021 వరకు 113 మ్యాచ్ లు ఆడాడు. 139 వికెట్లు పడగొట్టాడు. 7.5 ఎకానమీ రేటుతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఆర్సీబీ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

అయినా సరే, ఆర్సీబీ తనని వదిలేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ రూ.6.5 కోట్లకు చాహల్ ను కొనుగోలు చేసింది. వారి ఎంపిక తప్పు కాదని చాహల్ నేడు నిరూపించాడు. ఈరోజు ఐపీఎల్ సీజన్ 2024లో 8 మ్యాచ్ లు ఆడిన చాహల్ ఇప్పటివరకు 13 వికెట్లు తీశాడు.

గొప్ప ఆటగాళ్లను ఎంచి కొన్న రాజస్థాన్ రాయల్స్ నేడు నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. విలువైన ఆటగాళ్లను వదులుకుని ఆర్సీబీ అట్టడుగు స్థానంలో ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News