Big Stories

IPL 2024 39th Match- CSK Vs LSG Preview: ధోనీ సేన మెరుస్తుందా..? నేడు చెన్నయ్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్!

IPL 2024 39th Match- CSK Vs LSG Dream11 Prediction: ఏం జరుగుతుంది..? తాజాగా మొన్ననే వీరి మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగి చెన్నయ్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో చెన్నయ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అందుకు బదులుగా లక్నో కేవలం 2 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగురోజుల క్రితం జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయలేక చెన్నయ్ బౌలర్లు చెమటలు కక్కారు.

- Advertisement -

మళ్లీ నేడు ఈ రెండు జట్ల మధ్యా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నయ్ ఏమైనా పుంజుకుంటుందా? ఓపెనర్లని అవుట్ చేయడానికి ధోనీ ఎటువంటి సూచనలు రుతురాజ్ కి చేస్తాడనేది పెద్ద సస్పెన్స్ గా ఉంది. ఇకపోతే చెన్నయ్ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కి లక్నోసూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నయ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

ఇప్పటికి చెన్నయ్ 4వ స్థానంలో ఉంది. దీని తర్వాత 5వ స్థానంలో లక్నో ఉంది. రెండు జట్లు 7 మ్యాచ్ లు ఆడి 4 గెలిచాయి. మూడు ఓడి పోయాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్ లు జరిగాయి. చెరో రెండో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి.

Also Read: యశస్వి సెంచరీ.. రాజస్థాన్ గెలుపు.. ఓడిపోయిన ముంబయి

ఇకపోతే చెన్నయ్ సూపర్ కింగ్స్ ఐపీఎల్ ప్రారంభంలో బ్రహ్మాండంగా ఆడి, తర్వాత నెమ్మదించింది. లక్నో మొదట్లో తడబడి తర్వాత పుంజుకుంటోంది. చూడాలి మరి అటు రుతురాజ్ కెప్టెన్సీ, ఇటువైపు కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఎవరిది పై చేయి అవుతుందో అని అందరిలో ఉత్కంఠ బయలుదేరింది.

అక్కడ రుతురాజ్ వెనుక ధోనీ ఉన్నాడు. పేరుకి తనే కెప్టెన్ అయినా గ్రౌండులో అంతా ధోనీయే వెనకుండి నడిపిస్తున్నాడు. ఇక ఇప్పటికి కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు. మరి ఇదే ఫామ్ కొనసాగిస్తాడా? లేదా? అనేది చూడాలి.

Also Read: IPL 2024 Records: ఐపీఎల్.. ఒకవైపు రికార్డులు.. మరోవైపు విమర్శలు

రెండు వైపులా బౌలింగు చూస్తే చెన్నయ్ వైపు కొంచెం బలంగా ఉంది. కాకపోతే మొన్నవాళ్లే తేలిపోయారు. ఈసారి చెన్నయ్ భారమంతా బౌలర్లపైనే ఉంది. ఇక చూడాలి ఎవరు నాలుగో స్థానంలో ఉంటారు? ఎవరు ఐదులో కొనసాగుతారనేది రేపు తేలిపోతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News