BigTV English
Advertisement

IPL : ఉత్కంఠ పోరు.. చెన్నైకు షాక్.. రాజస్థాన్ విక్టరీ..

IPL : ఉత్కంఠ పోరు.. చెన్నైకు షాక్.. రాజస్థాన్ విక్టరీ..

IPL : ఐపీఎల్ లో మరో మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. రాజస్థాన్ , చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి రెండు ఓవర్లు క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్ర ఉత్కంఠకు గురిచేశాయి. చెన్నై విజయానికి 12 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన ఉండగా.. క్రీజులో జడేజా, ధోని ఉండటం మ్యాచ్ పై ఆసక్తి మరింత పెరిగింది. అంచనాలకు తగ్గట్టుగానే హోల్డర్ వేసిన 19 ఓవర్ లో జడేజా 2 సిక్సులు , ఫోర్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి.


ఇక చివరి ఓవర్ లో 21 పరుగులు చేయాలి. తొలి ఐదు బంతుల్లో 16 పరుగులు వచ్చాయి. చెన్నై విజయం సాధించాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాలి. క్రీజులో కెప్టెన్ ధోని ఉన్నాడు . అప్పటికే ఆ ఓవర్ లో రెండు సిక్సులు బాదాడు. ప్రపంచంలోనే గొప్ప మ్యాచ్ ఫినిషర్స్ లో ఒకడైన మహి బంతిని స్టాండ్ లోకి పంపడం ఖాయమనుకున్నారు. కానీ అప్పటి వరకు బంతులు ఎక్కడ వేయాలో అర్ధంకాక తడబడిన సందీప్ శర్మ.. చివరి బాల్ మాత్రం అద్భుతంగా వేశాడు. దీంతో ధోని ఒక్క పరుగు మాత్రమే తీశాడు. చెన్నైపై రాజస్థాన్ 3 పరుగుల తేడాతో గెలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. బట్లర్ (52, 36 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సులు) మరోసారి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. పడిక్కల్ ( 38, 26 బంతుల్లో 5 ఫోర్లు), అశ్విన్ (30, 22 బంతుల్లో ఫోర్, 2 సిక్సులు) హెట్ మైయర్ ( 30 నాటౌట్, 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. చెన్నై బౌలర్లలో దేశ్ పాండే , ఆకాష్ సింగ్, జడేజా రెండేసి వికెట్లు తీశారు. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.


176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాటం చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (50, 38 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. రహానే ( 31, 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో చెన్నై 15 ఓవర్లలో 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. విజయానికి 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన తరుణంలో.. ధోని (32 నాటౌట్, 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు ), జడేజా ( 25 నాటౌట్ , 15 బంతుల్లో 1 ఫోర్ , 2 సిక్సులు) చెలరేగడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరకు చెన్నై 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ , చాహల్ కు రెండేసి వికెట్లు, జంపా, సందీప్ శర్మకు తలో వికెట్ దక్కాయి. ఆల్ రౌండర్ షోతో అదరగొట్టిన అశ్విన్ కు ఫ్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో విజయంతో రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్ ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరింది. చెన్నై 4 మ్యాచ్ ల్లో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.

Related News

Shreyas Iyer: చావు దాక వెళ్లి వ‌చ్చాడు, ఇప్పుడు బీకినీ పాప‌ల‌తో బీచ్ లో ఎంజాయ్ !

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Shubman Gill: ఫ్రెంచ్ మోడల్ తో శుభ్‌మ‌న్ గిల్ సహజీవనం..షాకింగ్ ఫోటోలు ఇదిగో!

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

Big Stories

×