BigTV English

Rambai India’s Oldest Athlete : ఈ వయసులో 200 మెడల్స్.. ఇది రాంబాయ్ కథ..

Rambai  India’s Oldest Athlete : ఈ వయసులో 200 మెడల్స్.. ఇది రాంబాయ్ కథ..
Rambai  India's Oldest Athlete


Rambai India’s Oldest Athlete : ఆశయానికి, వయసుకు సంబంధం లేదని అంటుంటారు. ఎంత వయసు వచ్చినా.. ఆశయాన్ని వదులుకోకూడదని చెప్తుంటారు. అదే విషయాన్ని 106 ఏళ్ల రాంబాయ్ కాస్త సీరియస్‌గా తీసుకుంది. రెండేళ్ల క్రితం అథ్లెట్‌గా తన జీవితాన్ని ప్రారంభించి, తక్కువ సమయంలోనే 200కు పైగా మెడల్స్‌ను సాధించింది. ఈ సీనియర్ సిటిజన్ స్ప్రింటర్‌ను చూస్తుంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉంటే వయసుతో సంబంధం లేదని మళ్లీ నిరూపించిందని ప్రశంసిస్తున్నారు.

104 ఏళ్ల వయసులో రాంబాయ్ 100 మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డ్‌ను సాధించింది. తాజాగా మరోసారి తన సత్తాను చాటుకుంది. ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన 18వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌సిప్స్‌లో మరో మూడు గోల్డ్ మెడల్స్‌ను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల స్ప్రింట్, షార్ట్ పుట్‌.. ఇలా మూడు కేటగిరిల్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించి చూపించింది. ప్రతీ కేటగిరిలో దాదాపు మూడు నుండి అయిదు పార్టిసిపెంట్స్‌తో పోటీపడి రాంబాయ్ గోల్డ్ మెడల్స్‌ను అందుకుంది.


హర్యానాలోని చర్కి దద్రీ ప్రాంతానికి చెందిన కద్మా అనే చిన్న గ్రామంలో రాంబాయ్ జన్మించింది. కుటుంబానికి చెందిన పంట పొలాల్లోనే పనిచేస్తూ చాలావరకు తన జీవితాన్ని గడిపేసింది. 2016లో పంబాజ్‌కు చెందిన మాన్ కౌర్.. 100 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో విజయం సాధించడం చూసి బాగా స్ఫూర్తి చెందింది. తన ముని మనవరాలు కౌర్ కథను రాంబాయ్‌కు వినిపించి.. నువ్వు కూడా అలా చేయగలవు అంటూ మరింత ప్రోత్సహించడంతో రాంబాయ్.. తన కలను నిజం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

స్ప్రింటర్‌గా మారినప్పటి నుండి రాంబాయ్.. 14 స్పోర్టింగ్ ఈవెంట్స్‌లో పాల్గొంది. అందులో మొత్తంగా 200 మెడల్స్‌ను సాధించింది. ఇండియాలో మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా రాంబాయ్.. తన సత్తాను చాటుకుంది. తన కుటుంబంలో అందరూ రాంబాయ్ విజయాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముని మనవళ్లు, మనవరాళ్లు ఉన్న వయసులో ఇంత సాధించడం అనేది చిన్న విషయం కాదని తన కథ తెలిసిన వారు రాంబాయ్‌ను అభినందిస్తున్నారు. తనను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×